Akkayyapalem: జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి ముఖ్యమంత్రి కి వినతులు

Akkayyapalem: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి.

Venkata Thirumala
Published on: 7 May 2026 5:23 PM IST
Akkayyapalem
X

Akkayyapalem: జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి ముఖ్యమంత్రి కి వినతులు 

అక్కయ్యపాలెం: రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల పెండింగ్ సమస్యలు పరిష్కారానికి సంబంధించి త్వరలో మరోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను కలవాలని కార్యవర్గం నిర్ణయించడం జరిగిందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి (ఎన్ఏజే ) ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు.. విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ లు తెలిపారు.

గురువారం అక్కయ్యపాలెం జంక్షన్ వద్దనున్న ఒక ప్రైవేట్ హోటల్ లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ . ఏపీ బ్రాడ్ కాస్ట్.. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ల కార్యవర్గ సభ్యులు సమావేశమై జర్నలిస్టులకు సంబంధించిన కొన్ని ప్రధాన అంశాలపై చర్చించడం జరిగిందన్నారు.

ఈ సమావేశంలో తక్షణమే మూడు డిమాండ్లు పరిష్కారానికి ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని నిర్ణయించుకోవడం జరిగిందన్నారు.. దశాబ్దాల తరబడి పాత్రికేయుల సొంత ఇంటి కల నెరవేరలేదన్నారు.. అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించడంతోపాటు వారి సంక్షేమానికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరడం జరుగుతుందన్నారు.

తక్షణమే ఇళ్ల స్థలాలు ..ఇల్లు మంజూరు చేయాలని. ప్రమాద బీమా పాలసీ పునరుద్ధరించాలని.. పదవి విరమణ పొందిన జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలన్నదే తమ ముఖ్య డిమాండ్లుగా పేర్కొన్నారు.. వీటికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఆయా సమస్యలను వివరించడం జరుగుతుందన్నారు.. ఈ ఏడాది ఎలాగైనా ఆయా డిమాండ్లు పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.

అలాగే యూనియన్ బలోపేతానికి సంబంధించి మరిన్ని చర్యలు చేప డతామని వీరు చెప్పారు. సమావేశంలో ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసరావు.. ఆర్గనైజింగ్ సెక్రటరీలు ధవలేశ్వరపు రవి కుమార్. ఏ సాంబశివరావు. ఉపాధ్యక్షులు పి నగేష్ బాబు. బ్రాడ్ కాస్ట్ కార్యదర్శి కింతాడ మదన్.. ఉపాధ్యక్షులు శేషు.. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్.. కార్యదర్శి కె .శ్రీనివాసరావు.. ఇతర ప్రతినిధులు బొబ్బరి ప్రసాద్.. హరి.. కోశాధికారి కె వి శర్మ.. రవిశంకర్.. రాజశేఖర్.. జగన్నాథం.. లతోపాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Venkata Thirumala

Venkata Thirumala

Next Story