Anakapalle: అనకాపల్లిలో వైభవంగా శ్రీ కామాక్షి దేవి నవరాత్రి ఉత్సవాలు!

Anakapalle: అనకాపల్లి నిదానదొడ్డి కామాక్షి దేవి ఆలయంలో ఘనంగా దేవీ నవరాత్రులు, రథోత్సవం. ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు, అన్నసమారాధన.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 11 Oct 2026 2:32 PM IST
Anakapalle
X

Anakapalle: అనకాపల్లిలో వైభవంగా శ్రీ కామాక్షి దేవి నవరాత్రి ఉత్సవాలు!

Anakapalle: అనకాపల్లి పట్టణంలోని నిదానదొడ్డిలో వేంచేసియున్న శ్రీ కామాక్షి దేవి ఆలయంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రుల తొలిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉత్సవ విగ్రహాన్ని పట్టణ పురవీధుల్లో ఊరేగించారు.

ఈ సందర్భంగా శ్రీ కామాక్షి దేవి అమ్మవారిని ప్రత్యేక రథంపై ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. అనంతరం దాడి రత్నాకర్ చేతుల మీదుగా అమ్మవారి రథోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

వేల్పుల వీధి విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఊరేగింపులో పాల్గొన్న భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు దాడి రత్నాకర్‌ను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ సంఘం అధ్యక్షులు పొన్నాడ వెంకట సత్యనారాయణ ఆచారి (పెదబాబు), ప్రధాన కార్యదర్శి యండపల్లి మోహన్ బ్రహ్మాజీ, కోశాధికారి కిల్లాడ శ్రీనివాసరావు, పట్టణ స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు వెదురుపాటి సుందరయ్య (బాబి), పట్టణ కార్పెంటర్ సంఘం అధ్యక్షులు కోరుకొండ వెంకటరావు, కోటిపల్లి శ్రీను, విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI