Pendurthi: వైయస్సార్సీపీ విశాఖ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా కర్రి వెంకట సంతోష్ అప్పారావు!
Pendurthi: వైయస్సార్సీపీ విశాఖ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పెందుర్తికి చెందిన కర్రి వెంకట సంతోష్ అప్పారావు నియమితులయ్యారు. పార్టీ శ్రేణులు ఆయనకు అభినందనలు తెలిపారు.
Pendurthi: వైయస్సార్సీపీ విశాఖ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా కర్రి వెంకట సంతోష్ అప్పారావు!
Pendurthi: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు, నియామకాల ప్రక్రియలో భాగంగా విశాఖ జిల్లా కమిటీతో పాటు అనుబంధ విభాగాల్లో పలువురికి కొత్త బాధ్యతలు అప్పగించారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఈ నియామకాల్లో భాగంగా *పెందుర్తికి చెందిన కర్రి వెంకట సంతోష్ అప్పారావును వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా* నియమించారు. జిల్లా స్థాయిలో పార్టీ సంస్థాగత వ్యవహారాలను మరింత బలోపేతం చేయడం, పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం వంటి బాధ్యతల్లో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు.
తనపై పార్టీ అధిష్ఠానం ఉంచిన నమ్మకానికి కర్రి వెంకట సంతోష్ అప్పారావు కృతజ్ఞతలు తెలిపారు.*పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఆదీప్రాజ్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్*లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నాయకత్వం, కార్యకర్తల సహకారంతో జిల్లాలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
కర్రి వెంకట సంతోష్ అప్పారావుకు జిల్లా స్థాయి బాధ్యతలు దక్కడంతో పెందుర్తి ప్రాంతానికి చెందిన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు.




