Bheemili: జాతీయ స్థాయి అండర్-19 క్రికెట్ జట్టుకు కేథరిన్ విద్యార్థి ఎంపిక!

Bheemili: చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన ఎంపికల్లో ప్రతిభ చాటి జాతీయ అండర్-19 క్రికెట్ పోటీలకు ఎంపికైన భీమిలి కేథరిన్ విద్యార్థి చరణ్ తేజ.

SHIVA, BHIMILI
Published on: 13 Oct 2026 4:59 PM IST
Bheemili
X

Bheemili: జాతీయ స్థాయి అండర్-19 క్రికెట్ జట్టుకు కేథరిన్ విద్యార్థి ఎంపిక!

భీమిలి: స్థానిక భీమిలిలో గల కేథరిన్ విద్యాసంస్థల విద్యార్థి సంపగి చరణ్ తేజ నిన్న చిత్తూరు జిల్లా నగరిలో S. G. F ఆంధ్రా రాష్ట్ర జట్టు కొరకు జరిగిన ఎంపిక పోటీల్లో అండర్ 19 కేటగిరిలో అద్భుతమైన ప్రతిభ కనుపరిచి పలువురి మన్నలను పొంది ఎంపికైనాడు.

వివరాలలోకి వస్తే అండర్ 19 లో భాగంగా అక్టోబర్ నెల 10, 11,12 తేదీలలో జరిగాయి. అందు విశాఖ జిల్లా భీమిలి మండలం, కేథరిన్ కు చెందిన సంపంగి చరణ్ తేజ అద్భుతంగా తన ఆట ప్రతిభ ప్రదర్శించి జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక కావడం హర్షనీయం. త్వరలో అనగా నవంబర్ 13 - 17 తేదీలలో మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జరగబోయే జాతీయ స్థాయి క్రికెట్ పోటీకి ఆటను ఎంపిక అయ్యాడు.

ఈ సందర్భంగా కేథరిన్ విద్యాసంస్థల అధినేత శ్రీ ఆలివర్ రాయి మాట్లాడుతూ ఈ విధంగా జాతీయస్థాయి పోటీలకు కేథరిన్ విద్యార్థి ఎంపిక కావడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎందరో క్రీడాకారులు కేథరిన్ నుండి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కాబడి కేథరిన్ పేరును జాతీయస్థాయిలో మారు మ్రోగించారు.

ఈ పరిసర ప్రాంతాలలో ఆటలలో కేథరిన్ ఇచ్చే ప్రాధాన్యత, స్ఫూర్తి, ప్రోత్సాహం, కోచింగ్ మరే స్కూలు ఇవ్వడం లేదని, అందువల్లనే స్పోర్ట్స్ ర్యాంకింగ్ గత సంవత్సరం కూడా విశాఖ జిల్లాలో రెండవ స్థానం, మండలంలో మొదటి స్థానం చేజెక్కించుకున్నామని తెలియజేశారు.

క్రికెట్ పోటీలలో అత్యద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించిన చరణ్ తేజ్ ను కేథరిన్ విద్యాసంస్థల అధినేత శ్రీ ఆలివర్ రాయి ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో తను జాతీయ క్రికెట్ జట్టుకు కూడా ఆడాలని ఆశీర్వదించారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI