Gajuwaka: కిడ్నాప్‌ కలకలం.. టెక్నాలజీతో 13 ఏళ్ల బాలికను కాపాడిన విశాఖ పోలీసులు

Gajuwaka: గాజువాకలో కిడ్నాప్‌కు గురైన 13 ఏళ్ల బాలికను విశాఖ క్రైమ్ పోలీసులు టెక్నాలజీ సాయంతో రక్షించి కుటుంబానికి అప్పగించారు. సీపీ బాగ్చి ప్రశంసలు.

PRAKASH, GAJUWAKA
Published on: 2 Nov 2026 2:15 PM IST
Gajuwaka
X

Gajuwaka: కిడ్నాప్‌ కలకలం.. టెక్నాలజీతో 13 ఏళ్ల బాలికను కాపాడిన విశాఖ పోలీసులు

విశాఖపట్నం: గాజువాక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నవంబర్‌ 1 తెల్లవారుజామున కిడ్నాప్‌కు గురైన 13 ఏళ్ల బాలికను విశాఖ పోలీసులు క్షేమంగా రక్షించారు. 112కు సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. సౌత్‌ సబ్‌ డివిజన్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ సీఐ జీడీ బాబు, సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో బాలిక ఆచూకీ గుర్తించి సురక్షితంగా రక్షించారు.

అనంతరం బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల సమయస్ఫూర్తిని అభినందించిన నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి.. సీఐ జీడీ బాబు, సిబ్బందిని ప్రశంసించారు.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA