Konaseema: ప్రజా సమస్యలపై 165 అర్జీల స్వీకరణ
Konaseema: అమలాపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 165 అర్జీలను అధికారులు స్వీకరించారు.
Konaseema
Konaseema: అమలాపురం కలెక్టరేట్ ; డాక్టర్..బిఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఆశతో దూర ప్రాంతాల నుండి వస్తారని వారి సమస్యలను సానుభూతితో విని, సత్వర పరిష్కారం చూపడం ప్రతి అధికారి బాధ్యతని జిల్లా సంయుక్త కలెక్టర్ వైఖోమ్ నిదియాదేవి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లాస్థాయిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిధియాదేవి, ఆర్డిఓ జి మమ్మీ, డిఆర్డిఏ పిడి రాంబాబు, డిఎల్డి వోలు అర్జీదారుల నుండి సుమారుగా 165 అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సమస్యల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని,ప్రజల నుండి అందే వినతులను అత్యంత ప్రాధాన్యతతో, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.జిల్లా స్థాయి అధికారులు అందరూ తప్పనిసరిగా గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొనాలని ముందస్తు అనుమతి లేకుండా కార్యక్రమానికి గైర్హాజరయ్యే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.అర్జీలను కేవలం సాంకేతిక కారణాలతో తిరస్కరించకూడదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా పాటుపడాలన్నారు.ప్రతి వినతిని ప్రభుత్వం నిర్దేశించిన సేవా కాలపరిమితి లోపు పరిష్కరించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పాత అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని తక్షణమే క్లియర్ చేయాలన్నారు.
అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా పరిష్కారం జవాబుదారితనంతో ఉండాలన్నారు. పరిష్కరించబడిన అర్జీలకు సంబంధించి తీసుకున్న చర్యలను సంబంధిత అర్జీదారునికి లిఖితపూర్వకంగా లేదా ఫోన్ ద్వారా తెలియపరచాలన్నారు. అందిన ప్రతి అర్జీని ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసి, ఎప్పటిక ప్పుడు స్టేటస్‌ను అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. అర్జీదారుడి సమస్యకు సరైన పరిష్కారం చూపడమే అర్జీ
పరిష్కారానికి గీటురాయని, ప్రతి ఆర్జీని క్షుణంగా పరిశీలించి పునరావృతం కాకుండా సమస్యను పరిష్కరించాలన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాల్సిందేనన్నారు. నిబంధనలను పాటిస్తూ అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. సమస్యకు సంబంధించిన శాఖ జిల్లా స్థాయి అధికారి ప్రత్యేక దృష్టి సారించి సమస్యకు స్పష్టతతో కూడిన పరిష్కారం చూపాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు.
అర్జీదారులు సంతృప్తి చెందేలా పారదర్శకంగా పరిష్కారం ఉండాలని, గడుపుతీరిన అర్జీలు ఏ స్థాయిలోను పెండింగ్ లో ఉండరాదన్నారు. సంతృప్తికరంగా పరిష్కారం చూపితే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందనే సందేశం ప్రతి అధికారి దృష్టిలో ఉండాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయి అధికారులతో సమస్వయం చేసుకొని ఆర్జీల పరిష్కారంపై నేరుగా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో ప్రతి అర్జీదారులు వినతులను సమర్పిస్తారని, ఆయా ఆర్జీలకు సకాలంలో
పరిష్కారం చూపాల్సిన భాధ్యత అధికారులపై ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ నిదియాదేవి అన్నారు. వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టి క్షేత్రస్థాయి అధికారులతో పటిష్ట సమన్వయంతో జాప్యానికి తావులేకుండా పరిష్కరించాలన్నారు. ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి, క్షేత్ర స్థాయి అధికారుల సహకారంతో నిర్దేశించిన గడువులోగా ఆర్జీలు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




