Kanchili: కొండపోలేరులో దేవాలయానికి విద్యుత్ సౌకర్యం!

Kanchili: కంచిలి మండలం కొండపోలేరు దేవాలయానికి నూతన విద్యుత్ కనెక్షన్ మంజూరైంది. అధికారుల స్పందనకు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.

G.RAMBABU, SOMPET
Published on: 10 Aug 2026 7:03 AM IST
Kanchili
X

Kanchili: కొండపోలేరులో దేవాలయానికి విద్యుత్ సౌకర్యం!

గ్రామస్థుల విజ్ఞప్తితో నూతన విద్యుత్ కనెక్షన్

కంచిలి: మండలం కొండపోలేరు గ్రామంలోని దేవాలయానికి ఆదివారం విద్యుత్ సరఫరా ఏర్పాటు చేశారు. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవడంతో దేవాలయానికి విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవాలయానికి విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు సహకరించిన అధికారులకు, టీడీపీ కంచిలి మండల అధ్యక్షుడు మాదిన రామారావు, బొడ్డ హరిబాబు, మద్దిల ఆనంద్, కృష్ణారావు, తదితర ప్రజాప్రతినిధులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story