Simhachalam: సింహాచల క్షేత్రంలో ఘనంగా కూచిపూడి నృత్య ప్రదర్శన!
Simhachalam: సింహాచల క్షేత్రంలో ఘనంగా కూచిపూడి నృత్య ప్రదర్శన. కళాకారులను, భక్తులను అభినందించిన ఈఓ జల్లేపల్లి వెంకట్రావు.
Simhachalam: సింహాచల క్షేత్రంలో ఘనంగా కూచిపూడి నృత్య ప్రదర్శన!
Simhachalam: శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి దివ్య క్షేత్రమైన సింహాచలంలో భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు కళా వైభవాన్ని అందించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం రాజగోపురం పక్కన గల కళావేదికపై కూచిపూడి నృత్య ప్రదర్శన ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ సిద్ధేంద్రయోగి నాట్యాలయం, మధురవాడ, విశాఖపట్నం. ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య ప్రదర్శనలు భక్తులను, కళాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారులు సంప్రదాయబద్ధమైన కూచిపూడి నృత్యరీతిలో వివిధ ఆధ్యాత్మిక, పౌరాణిక అంశాలను అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు మాట్లాడుతూ, సింహాచల క్షేత్రంలో భక్తులకు స్వామివారి దర్శనంతో పాటు తెలుగు సంస్కృతి, సంప్రదాయ కళల వైభవాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా యువతలో మన సంప్రదాయ కళల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు.
కళాకారులు తమ ప్రతిభతో కూచిపూడి నృత్యానికి ఉన్న ప్రత్యేకతను చాటిచెప్పారని, స్వామివారి సన్నిధిలో ఇటువంటి కళా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భక్తులకు ఆధ్యాత్మికతతో కూడిన ఆహ్లాదకరమైన అనుభూతి కలుగుతుందని ఈఓ పేర్కొన్నారు. సాయంత్రం 5:00 గంటల నుంచి 7:00 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని భక్తులు, కళాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించాలని దేవస్థానం అధికారులు కోరారు. స్వామివారి సన్నిధిలో ఆధ్యాత్మిక వాతావరణానికి కళా వైభవం తోడవడంతో సింహాచల క్షేత్రం భక్తులతో పాటు కళాభిమానులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది.




