Visakhapatnam: పద్మనాభం రెవెన్యూ అధికారుల నిర్వాకం: బాధితుడి ఆవేదన!
Visakhapatnam: చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని రెవెన్యూ రికార్డుల్లో మరొకరి పేరుతో మ్యుటేషన్ చేసిన ఘటన పద్మనాభం మండలంలో వెలుగుచూసింది.
Visakhapatnam: పద్మనాభం రెవెన్యూ అధికారుల నిర్వాకం: బాధితుడి ఆవేదన!
Visakhapatnam: ప్రభుత్వ రికార్డుల్లో చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి, రెవెన్యూ రికార్డుల్లో మాత్రం మరొకరి పేరిట ఉండటం పద్మనాభం, మండలం, కొరాడ, గ్రామంలో కలకలం రేపింది. పద్మనాభం మండల రెవెన్యూ అధికారుల అలసత్వం, అక్రమాల కారణంగా బాధితుడు రోడ్డున పడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. ఆనందపురం, మండలం బంటుపల్లి వారి కల్లాలు, గ్రామానికి చెందిన వెన్ని అప్పలరాజు. S/o లేట్ సన్యాసి గారు 23-10-2024 న భీమునిపట్నం, ఎస్ ఆర్ ఓ, నందు డాక్యుమెంట్ నెంబర్ . 9372/2024 ద్వారా సర్వేనెంబర్ 141-4P & 1331 లోని 0.138 సెంట్ల భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. ఈసీ,కూడా ఆయన పేరు మీదే ఉంది. అయితే రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్పు కోసం వెళ్లగా షాక్ తగిలింది.
అప్పలరాజు పేరుకు బదులు "తాళ్లపూడి సన్యాసమ్మ W/o రామారావు" అనే ఆమె పేరు 1బి,రికార్డులో ఎక్కించారు.. ఈ విషయమై అప్పలరాజు ఆర్.టి.ఐ ద్వారా సమాచారం కోరాగా నిజాలు వెలుగులోకి వచ్చాయి . పద్మనాభం మండల, డిప్యూటీ , తహసీల్దార్ & పి ఐ ఓ కె . చంద్రశేఖర్. ఎస్సార్ . నెంబర్.35/2026 తేదీ.11-03-2026 ద్వారా ఇచ్చిన సమాధానంలో " డాక్యుమెంట్ నెంబర్. 9372/2024 ద్వారా అప్పలరాజు కొనుగోలు చేసినప్పటికీ, మ్యుటేషన్ సమయంలో సదరు సన్యాసమ్మ పేరు నమోదు చేయడమైనది" అని స్వయంగా ఒప్పుకున్నారు.
విచారణలో,ఫోర్జరీతో మ్యుటేషన్,తొ తాళ్లపూడి సన్యాసమ్మ, 04-01-2025 న తప్పుడు నోటరీ అఫిడవిట్ ఇచ్చి "ఈ భూమి 1990 నుండి తన అనుభవంలో ఉంది" అని అబద్ధం చెప్పినట్లు తేలింది. ఈ ఫేక్ పత్రాల ఆధారంగా పద్మనాభం, వీఆర్ఓ,ప్రవళిక, ఫీల్డ్ విచారణ చేయకుండా, తప్పుడు రిపోర్ట్ ఇవ్వగా, డిప్యూటీ, తహసీల్దార్ కె . చంద్రశేఖర్, దానిని ఆమోదించి, అక్రమ మ్యుటేషన్ చేశారని బాధితుడు ఆరోపించారు.
బాధితుడి ఆవేదన... నా సొంత డబ్బుతో కొన్న భూమి, రిజిస్ట్రేషన్ నా పేరున ఉంది. అయినా రెవెన్యూ అధికారులు లంచం తీసుకుని మరొకరి పేరు ఎక్కించారు. నాకు నోటీసు కూడా ఇవ్వలేదు" అని అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులపై చర్యలు కోరుతూ ఆర్ డి ఓ , కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాధితుడు ఆర్డీవో భీమిలి, జిల్లా కలెక్టర్ విశాఖలకు ఫిర్యాదు చేశారు.
అక్రమ మ్యుటేషన్ రద్దు చేసి, తన పేరు పునరుద్ధరించాలని, ఈ మోసంలో పాల్గొన్న డిప్యూటీ. తహసీల్దార్ కె . చంద్రశేఖర్, వీఆర్వో ప్రవళిక లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.




