Anakapalli: ఏ కోడూరులో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు!

Anakapalli: అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలం ఏ కోడూరు గ్రామంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 10 Oct 2026 9:58 AM IST
Anakapalli
X

Anakapalli: ఏ కోడూరులో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు!

Anakapalli: అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలం, ఏ కోడూరు గ్రామంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి హరి నారాయణ ముఖ్య అతిథిగా హాజరై ఏ కోడూరు గ్రామ ప్రజలకు వివిధ చట్టాలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ చిన్న చిన్న తగాదాలకు కోర్టులను ఆశ్రయించి సమయం డబ్బులు వృధా చేసుకోవద్దు అని సూచించారు.

రాజీమార్గం మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటే సమయం ఆర్థిక కోణంలో ఆదా అవుతాయని తెలిపారు అలాగే మహిళలు విద్యార్థులపై వేధింపులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని వివరించారు.

యువత గంజాయి ఇతర మత్తు పదార్థాలు జోలికి వెళ్లకుండా భవిష్యత్తును కాపాడుకోవాలని హితవు పలికారు.అలాగే కె కోటపాడు CI గారు అయిన కిలపర్తి కృష్ణ గారు మత్తు పదార్థాలు వినియోగం వల్ల జీవితాలు నాశనము కాకుండా యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి గౌరీ శంకర్రావు, కోటపాడు CI గారు అయిన కిలపర్తి కృష్ణ గారు, న్యాయవాదులు డి శివప్రసాద్, ఎస్ అప్పారావు గ్రామ పెద్దలు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM