Visakhapatnam: లారీలో రాపిడి వల్ల చెలరేగిన మంటలు పూర్తిగా బూడిదైన వాహనం

Visakhapatnam: విశాఖ అక్కిరెడ్డిపాలెం వద్ద జాతీయ రహదారిపై లారీ దగ్ధం. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం. ఎన్‌హెచ్‌-16 పై రెండు గంటల పాటు నిలిచిపోయిన ట్రాఫిక్.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 23 Aug 2026 11:49 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: లారీలో రాపిడి వల్ల చెలరేగిన మంటలు పూర్తిగా బూడిదైన వాహనం

Visakhapatnam: విశాఖ అక్కిరెడ్డిపాలెం వద్ద లారీకి మంటలు రెండు గంటలు ట్రాఫిక్ జామ్ అప్రమత్తమైన డ్రైవర్‌తో తప్పిన పెను ప్రమాదం!అక్కిరెడ్డిపాలెం హైవేపై లారీ దగ్ధం పెందుర్తి నుంచి ఆనందపురం వెళ్లే మార్గంలో ఎన్‌హెచ్‌–16పై ఘటన.

తమిళనాడు నుంచి ఫినిషింగ్ బోర్డ్ పౌడర్ లోడ్‌తో ఒడిశాలోని కటక్‌కు వెళ్తున్న లారీ, లోడ్ చేసిన పౌడర్ బస్తాల రాపిడి కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే లారీని పక్కకు నిలిపివేశాడు.

రెండు ఫైర్ వాహనాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చిన సిబ్బంది, మంటలు తీవ్రంగా వ్యాపించడంతో లారీ పూర్తిగా దగ్ధం, లారీ దగ్ధంతో ఎన్‌హెచ్‌–16పై భారీగా ట్రాఫిక్ అంతరాయం.

దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story