Anakapalli: అనకాపల్లిలో 39 మద్యం దుకాణాలకు లాటరీ అక్టోబర్ 5న ప్రక్రియ!

Anakapalli: అనకాపల్లి జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్సుల పునరుద్ధరణ ముగిసింది. మిగిలిన 39 దుకాణాలకు అక్టోబర్ 5న లాటరీ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 26 Sept 2026 7:59 AM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లిలో 39 మద్యం దుకాణాలకు లాటరీ అక్టోబర్ 5న ప్రక్రియ!

Anakapalli: అనకాపల్లి జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్సుల పునరుద్ధరణ ప్రక్రియ పూర్తయింది. 2026–27 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో ప్రస్తుతం నిర్వహిస్తున్న మొత్తం 155 మద్యం దుకాణాల్లో 122 దుకాణాలకు లైసెన్సుదారులు పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకున్న 122 దుకాణాల్లో 107 ఓపెన్‌ కేటగిరీకి, 15 గీత కులాలకు కేటాయించిన దుకాణాలు ఉన్నట్లు జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారులు వెల్లడించారు.

మిగిలిన 39 మద్యం దుకాణాలకు కొత్తగా లైసెన్సులు మంజూరు చేయనున్నారు. వీటిలో 33 దుకాణాలు ఓపెన్‌ కేటగిరీకి, 6 దుకాణాలు గీత కులాలకు కేటాయించినవిగా అధికారులు తెలిపారు.

అక్టోబర్‌ 1 వరకు దరఖాస్తులు

కొత్తగా లైసెన్సులు పొందేందుకు ఆసక్తి ఉన్నవారి నుంచి సెప్టెంబర్‌ 24వ తేదీ నుంచి అక్టోబర్‌ 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది.

అక్టోబర్‌ 5న లాటరీ

దరఖాస్తుల స్వీకరణ అనంతరం అక్టోబర్‌ 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అనకాపల్లి గుండా జంక్షన్‌లోని ఎస్ఆర్‌ శంకర్‌ మీటింగ్‌ కాంప్లెక్స్‌లో లాటరీ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI