Madhurawada: అంతర్జాతీయ స్థాయికి చంద్రంపాలెం స్కూల్ మైదానం
Madhurawada: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రత్యేక చొరవతో చంద్రంపాలెం స్కూల్ గ్రౌండ్‌ను ₹4 కోట్ల దివిస్ ల్యాబ్స్ నిధులతో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి.
Madhurawada: అంతర్జాతీయ స్థాయికి చంద్రంపాలెం స్కూల్ మైదానం
Madhurawada: ప్రభుత్వాలు మారుతున్నా, దశాబ్దాలుగా చిన్న చినుకు పడితే చాలు చిత్తడిగా మారి విద్యార్థులను నిరాశకు గురిచేస్తున్న మధురవాడ చంద్రంపాలెం ఉన్నత పాఠశాల మైదానానికి ఎట్టకేలకు మహర్దశ పట్టింది. భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ప్రత్యేక చొరవ, దివిస్ లేబరేటరీస్ వారి ₹4 కోట్ల సి.ఎస్.ఆర్ (CSR) నిధుల సౌజన్యంతో ఈ మైదానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దు తున్నారు శుక్రవారం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు అధికారులతో కలిసి పాఠశాల అభివృద్ధి పనులను మధురవాడ జంక్షన్‌లో నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా మైదానం ఈ సందర్భం గా ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ విద్యార్థుల చిరకాల స్వప్నమైన చంద్రం పాలెం స్కూల్ గ్రౌండ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా అధు నాతన క్రీడా మైదానం అసెంబ్లీ పరేడ్ గ్రౌండ్ వివిధ రకాల ఆటల కోర్టులు ప్రత్యేక వాకింగ్ & రన్నింగ్ ట్రాక్‌లు వర్షపు నీరు నిల్వ ఉండకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నీటి సంపులు, ఇంకుడు గోతుల ఏర్పాటు ఈ పనులన్నింటినీ వేగ వంతం చేసి ఆగస్టు 15 నాటి కి పూర్తిస్థాయిలో అందు బాటులోకి తెస్తామని ఆయన స్పష్టం చేశారు.
మధురవాడ ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెర నిత్యం ప్రమాదాలకు నెలవుగా మారిన మధురవాడ జంక్షన్ లో నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులను కూడా ఎమ్మెల్యే పరిశీలించారు స్థానిక ప్రజల సుదీర్ఘ నిరీక్షణ కు తెర దించుతూ నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ పనులను వేగ వంతం చేసి, దీనిని కూడా ఆగస్టు 15న ప్రారంభోత్స వానికి సిద్ధం చేయనున్నట్లు ప్రకటించారు తప్పు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు గతంలో చంద్రంపాలెం పాఠశాల ప్రధానోపాధ్యా యునిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎమ్మెల్యే గంటా ఆదేశాల మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపారు.
శుక్రవారం పాఠ శాల ప్రిన్సిపాల్ ఛాంబర్‌లో అధికారులతో ప్రత్యేక సమా వేశం నిర్వహించిన ఎమ్మెల్యే, విద్యాశాఖ అధికారులు సమర్పించిన ఎంక్వైరీ నివేది కను క్షుణ్ణంగా పరిశీలించారు బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
ఈ కార్య క్రమంలో పాఠశాల ఇన్‌చార్జ్ హెచ్ఎం సుజాత, విద్యాశాఖ ఆర్‌జేడీ విజయభాస్కర్, డీఈఓ ఎన్.ప్రేమ్ కుమార్, డిప్యూటీ డీఈఓ ఎ.సోమే శ్వరరావు,జీవీఎంసీ జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు,ఎంఈఓ సిహెచ్ రవీంద్రబాబు,అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ రవి కుమార్,కమిటీ ప్రతినిధులు జి.అచ్యుతరావు, పి.నూక రత్నం,నాగోతి అప్పలరాజు, మోకర రవి,మరియు స్థానిక నాయకులు చిక్కాల విజయ బాబు,పిల్లా వెంకట్రావు,గరే గురునాథ్ తదితరులు పాల్గొన్నారు.




