Madhurawada: గాంధీ జయంతి వేడుకలు నిర్వహించిన సీఐటీయూ నాయకులు

Madhurawada: మధురవాడ స్వతంత్రనగర్‌లో గాంధీ 157వ జయంతి వేడుకలను సీఐటీయూ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గాంధీజీ ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

JAI RAM, MADURAWADA
Published on: 2 Oct 2026 5:39 PM IST
Madhurawada
X

Madhurawada: గాంధీ జయంతి వేడుకలు నిర్వహించిన సీఐటీయూ నాయకులు

మధురవాడ: మహాత్మా గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. గాంధీజీ 157వ జయంతి సందర్భంగా పూర్వ 5వ వార్డు స్వతంత్రనగర్‌ తుఫాన్‌ బిల్డింగ్‌ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి నాయకులు డి. అప్పలరాజు, ఎం.వి. ప్రసాద్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి, సామరస్యం, మత సామరస్యం, దేశ ఐక్యత కోసం గాంధీజీ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. అంటరానితనం నిర్మూలనతో పాటు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఆయన పాటుపడ్డారని తెలిపారు. నేటి పాలకులు ప్రజలు, కార్మికుల హక్కులను హరిస్తున్నారని విమర్శించారు.

గాంధీజీ పోరాట స్ఫూర్తితో ప్రజలు తమ హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని కోరారు. కార్యక్రమంలో జీ. కిరణ్‌, జీ. విజయ్‌, స్వర్ణమ్మ, ఏ. నరేంద్ర, ఏ. మాధవ్‌, ఎం. సుశీల, రాజు తదితరులు పాల్గొన్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA