Madhurawada: 3,000 మట్టి వినాయకుల ఉచిత పంపిణీ.. నాగోతి సేవలు!

Madhurawada: పరదేశమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 వేల మట్టి వినాయక విగ్రహాలు, పూజా పుస్తకాల ఉచిత పంపిణీ. నాగోతి వెంకట సత్యనారాయణ (జపాన్) నేతృత్వంలో కార్యక్రమం.

JAI RAM, MADURAWADA
Published on: 13 Sept 2026 1:14 PM IST
Madhurawada
X

Madhurawada: 3,000 మట్టి వినాయకుల ఉచిత పంపిణీ.. నాగోతి సేవలు!

Madhurawada: వినాయక చవితి పండుగను పర్యావరణహితంగా జరుపుకోవాలనే సత్సంకల్పంతో మధురవాడ ప్రాంతంలో భారీ ఎత్తున మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.శ్రీశ్రీశ్రీ పరదేశమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,తెలుగుదేశం పార్టీ 5వ వార్డు అధ్యక్షులు,పార్టీ యువ నాయకులు నాగోతి వెంకట సత్యనారాయణ (జపాన్) ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది.​

ఈసందర్భంగా మధురవాడలోని పలు ప్రధాన దేవాలయాల వద్ద,మార్కెట్ ప్రాంగణంలో,నగరంపాలెం రోడ్డు ప్రాంతాల్లో భక్తులకు,స్థానిక ప్రజలకు 3,000మట్టి వినాయక విగ్రహాలను మరియు 3,000వినాయక వ్రతకల్పం పుస్తకాలను ఉచితంగా అందజేశారు.​ఈసందర్భంగా నాగోతి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు,మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావునాయకత్వంలో,టిడిపి యువ నాయకులు గంటా రవితేజ నిరంతర ప్రోత్సాహం, మార్గదర్శకత్వంతోనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టామని తెలిపారు.

ప్రకృతిని,పర్యావరణాన్ని పరిరక్షించడమే తమ ముఖ్య ఉద్దేశమని,రసాయన విగ్రహాల వల్ల కలిగే కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని పిలుపునిచ్చారు.​స్థానిక ప్రజల సంక్షేమం, పర్యావరణ రక్షణే ధ్యేయంగా శ్రీశ్రీశ్రీ పరదేశమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నాగోతి వెంకట సత్యనారాయణ చేపడుతున్న ఈసేవా కార్యక్రమాలపై మధురవాడ వాసులు,పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

నియోజకవర్గ అభివృద్ధికి శ్రమిస్తున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అడుగుజాడల్లో నడుస్తూ, పార్టీకి,సమాజానికి నాగోతి సత్యనారాయణ అందిస్తున్న సేవలు కొనియాడదగినవని స్థానికులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు,తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA