Madhurawada: మధురవాడలో ఆక్రమణల తొలగింపు: ఆపరేషన్ లంగ్స్ 4.0
Madhurawada: మధురవాడలో ట్రాఫిక్ సమస్యల నియంత్రణకు జీవీఎంసీ సిద్ధం. ఆపరేషన్ లంగ్స్ 4.0లో భాగంగా సోమవారం నుంచి విస్తృత ఆక్రమణల తొలగింపు. స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచన.
Madhurawada: మధురవాడలో ఆక్రమణల తొలగింపు: ఆపరేషన్ లంగ్స్ 4.0
మధురవాడ: మధురవాడ పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల నియంత్రణకు జీవీఎంసీ నడుం బిగించింది. కమిషనర్ ఆదేశాల మేరకు ఆపరేషన్ లంగ్స్ 4.0 లో భాగంగా సోమవారం నుండి మధురవాడ జోన్ పరిధిలో విస్తృత స్థాయిలో రహదారి ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టనున్నారు.
రహదారులు, ఫుట్‌పాత్‌లు, బస్ షెల్టర్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన అక్రమ బడ్డీలు,తాత్కాలిక నిర్మాణాలను మున్సిపల్ సిబ్బంది తొలగించనున్నారు.క్రికెట్ స్టేడియం నుండి కొమ్మాది జంక్షన్ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్లలో ఉన్న ఆక్రమణలపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు.దీంతో పాటు మధురవాడ జంక్షన్, మిథిలాపురి ఉడా కాలనీ రోడ్డు,సాగర్‌నగర్ బీచ్ రోడ్డు,ఎండాడ,కొమ్మాది, పీఎం పాలెం,సాయిప్రియ రోడ్డు,నగరంపాలెం,
స్వతంత్రనగర్,శివశక్తినగర్, రోడ్లు తదితర ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న అక్రమ షెడ్లు,వ్యాపారాలను ఆక్రమణదారులు వెంటనే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.లేనిపక్షంలో ముందస్తు సమాచారం లేకుండానే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించి, ప్రజలకు సురక్షితమైన రవాణా వ్యవస్థను అందించేందుకు ప్రతి పౌరుడుబాధ్యతాయుతంగా వ్యవహరించి జీవీఎంసీకి సహకరించాలని కమిషనర్ కోరారు.




