Madhurawada: మధురవాడలో ఘనంగా ఉచిత వైద్య,రక్తదాన శిబిరాలు
Madhurawada: ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం మధురవాడ పరిధిలోని శ్రీవల్లీనగర్‌లో మెగా ఉచిత వైద్య, రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది.
Madhurawada: మధురవాడలో ఘనంగా ఉచిత వైద్య,రక్తదాన శిబిరాలు
మధురవాడ: ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవల్లీనగర్‌లో ఆదివారం మెగా ఉచిత వైద్య,రక్తదాన శిబిరాలను ఘనంగా నిర్వహించారు.హజరత్ ముక్తియార్ అలీ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎం.డి.ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో,ఇండియన్ రెడ్ క్రాస్ మరియు అపోలో హాస్పిటల్స్ సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.ఈశిబిరంలో స్థానిక యువత,జర్నలిస్టులు, సామాజిక సేవకులతో కలిపి సుమారు ౧౨౦ మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
200మందికి పైగా ప్రజలు ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు.అపోలో హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ వరకిషన్, డాక్టర్ వై.సురేంద్ర,డాక్టర్ మేఘా నాయుడు,డాక్టర్ వివేక్ బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించి,ఉచితంగా మందులను పంపిణీ చేశారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రెడ్ క్రాస్ సొసైటీ విశాఖ చైర్మన్ బాల సతీష్ హాజరయ్యారు. ఫౌండేషన్ ప్రతినిధులు ఎం.డి.బాషా మొహిద్దీన్, ఎం.డి.హసన్ అహ్మద్, ఎం.డి.ఖాసీమ్, ఎస్.కె. షహనాజ్, డాక్టర్ ఫాజిల్ తదితరులు శిబిరాన్ని పర్యవేక్షించారు. స్థానిక ప్రజల నుంచి ఈసేవా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.




