Madhurawada: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలందిస్తా పిల్లా అనిత

Madhurawada: జీవీఎంసీ 8వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిల్లా అనితకు శ్రీనివాస్ నగర్‌లో ఆత్మీయ స్వాగతం. మౌలిక సదుపాయాల కల్పన, సమస్యల పరిష్కారమే లక్ష్యమని వెల్లడి.

JAI RAM, MADURAWADA
Published on: 23 Oct 2026 11:05 PM IST
Madhurawada
X

Madhurawada: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలందిస్తా పిల్లా అనిత

మధురవాడ: జీవీఎంసీ 8వ వార్డు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా అనితకు శ్రీనివాస్ నగర్ కాలనీ వాసులు హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

వార్డులో తాగునీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ వంటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి అవసరాలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సేవలందిస్తానని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు మాట్లాడుతూ, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేలా ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్‌లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA