Nathavaram: నాతవరం మండలంలో వైసీపీకి భారీ షాక్

Nathavaram: నాతవరం మండలం ములగపూడిలో మాజీ ఎంపీటీసీ లోవకృష్ణ ఆధ్వర్యంలో 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి; నర్సీపట్నం పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ ఆహ్వానించారు.

R. A. Naidu, Narsipatnam
Published on: 31 Oct 2026 8:09 PM IST
Nathavaram
X

Nathavaram: నాతవరం మండలంలో వైసీపీకి భారీ షాక్

​నాతవరం: నాతవరం మండలంలో ప్రతిపక్ష వైసీపీకి వలసల సెగ గట్టిగా తగులుతోంది. తాజాగా ములగపూడి గ్రామంలో ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ తమరాన లోవకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 30 కుటుంబాలకు చెందిన 150 మంది నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమానికి హాజరైన నర్సీపట్నం పట్టణ టీడీపీ అధ్యక్షులు చింతకాయల రాజేష్‌కు గ్రామ మహిళలు, ప్రజలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీలో చేరిన వారికి రాజేష్ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ​

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాజేష్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంసకర పాలనను ప్రజలు పూర్తిగా విడనాడారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై మాజీ ఎంపీటీసీ లోవకృష్ణ తన అనుచరులతో కలిసి పార్టీలో చేరడం సంతోషదాయకమన్నారు.

మొన్న 29వ తేదీన గునుపూడి గ్రామంలో ఎంపీ చింతకాయల విజయ్ సమక్షంలో వైసీపీకి చెందిన 200 కుటుంబాలు టీడీపీలో చేరాయని, ఆ వలసల పరంపర ములగపూడికి కూడా విస్తరించిందని ఆయన గుర్తుచేశారు.

గత రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న పునర్నిర్మాణాన్ని చూసి పార్టీలోకి వస్తున్న వారికి నాయకత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని రాజేష్ హామీ ఇచ్చారు. పార్టీలో ముందు నుంచి ఉన్న బాలనాయుడు, వెంకటేష్, జ్యోతమ్మ, సత్యంబాబు తదితరులతో సమానంగా కొత్తవారికి సైతం పూర్తి గౌరవం, ప్రాధాన్యం ఉంటుందని భరోసా కల్పించారు.

​ఈ కార్యక్రమంలో తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కరక సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి రమణ, జెడ్పీటీసీ అభ్యర్థి లెక్కల సన్యాసినాయుడు, ఎంపీటీసీ అభ్యర్థి సత్య తదితర నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam