Makavarapalem: వజ్రగడలో ఘనంగా ‘పోషణ్ మాసం 2026’ వేడుకలు
Makavarapalem: అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం వజ్రగడ అంగన్‌వాడీలో పోషణ్ మాసం వేడుకలు ఘనంగా నిర్వహించారు; పోషక వంటకాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.
Makavarapalem: వజ్రగడలో ఘనంగా ‘పోషణ్ మాసం 2026’ వేడుకలు
మాకవరపాలెం: అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం వజ్రగడ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం ఆధ్వర్యంలో ‘పోషణ్ మాసం - 2026’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ రమణమ్మ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారులకు పౌష్టికాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. స్థానిక అంగన్‌వాడీ కార్యకర్తలు, మహిళలు స్వయంగా తయారుచేసిన విభిన్న సంప్రదాయ పోషక వంటకాలను ఇక్కడ ప్రత్యేకంగా ప్రదర్శించారు.
రకరకాల పిండివంటల ప్రదర్శన, పిల్లలు, గర్భిణులు, అంగన్‌వాడీ కార్యకర్తలు,
పిల్లలు, బాలింతలు మరియు గర్భిణుల్లో పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా ‘మన అంగన్‌వాడీ - మన బాధ్యత’ నినాదంతో వజ్రగడలో పోషణ్ మాసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా చిరుధాన్యాలు, ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు, పప్పుదినుసులతో తయారుచేసిన పలు రకాల సంప్రదాయ పిండివంటలు, ఆహార పదార్థాలను ఆకర్షణీయంగా ప్రదర్శించారు. CDPO రమణమ్మ మాట్లాడుతూ — తక్కువ ఖర్చుతో ఇంట్లోనే లభించే పోషక విలువలున్న ఆహారాన్ని రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనతను అరికట్టవచ్చని, తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. అంగన్‌వాడీ సేవల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ ప్రదర్శనలో ప్రదర్శించిన వైవిధ్యభరితమైన పోషకాహార వంటకాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా సెక్రటరీ సీరంరెడ్డి సూర్య నారాయణ , మాకవరపాలెం మండల ప్రెసిడెంట్ అప్పలనాయుడు, వెంకటేష్, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, గ్రామస్తులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.




