Anakapalli: ఆర్ఎంపీ ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి కె.కోటపాడులో విషాదం

Anakapalli: కె.కోటపాడు మండలం ఆనందపురంలో విషాదం. ఆర్ఎంపీ ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి చెందినట్లు కుమారుడి ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 25 Aug 2026 9:59 AM IST
Anakapalli
X

Anakapalli: ఆర్ఎంపీ ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి కె.కోటపాడులో విషాదం

Anakapalli: అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఆనందపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కాలి పై తామర మచ్చలు రావడంతో ఏ.కోడూరులోని మారుతీ గణేష్ మెడికల్ & జనరల్ స్టోర్స్‌లో ఆర్ఎంపీ డాక్టర్ పి.త్రినాథ్‌ను ఆశ్రయించిన ఈశ్వరరావు వైద్యం చేయించుకున్నారు.

వైద్యంలో భాగంగా ఈశ్వరరావుకు ఇంజక్షన్ ఇచ్చినట్లు ఆయన కుమారుడు అక్కునాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంజక్షన్ తీసుకున్న కొద్దిసేపటికే ఈశ్వరరావుకు వణుకు రావడంతో, పరిస్థితి విషమించి మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

మృతుడి కుమారుడు అక్కునాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ఇంజక్షన్ వల్లే ఈశ్వరరావు మృతి చెందాడా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, వైద్యపరమైన ఆధారాల ఆధారంగా మృతికి అసలు కారణం నిర్ధారించనున్నారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story