Simhachalam: రాష్ట్రంలోనే తొలి ఎలక్ట్రిక్ బస్ డిపో అందుబాటులోకి!
Simhachalam: రాష్ట్రంలోనే తొలి ఎలక్ట్రిక్ బస్ డిపోను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించి, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Simhachalam: రాష్ట్రంలోనే తొలి ఎలక్ట్రిక్ బస్ డిపో అందుబాటులోకి!
సింహాచలం: విశాఖపట్నం జిల్లా సింహాచలంలో రాష్ట్రంలోనే తొలి ఎలక్ట్రికల్ బస్ డిపోను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. సింహపురి కాలనీ వద్ద సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలు, ఈ-సబ్‌స్టేషన్‌తో ఈ డిపోను అందుబాటులోకి తీసుకువచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకో-ఫ్రెండ్లీ రవాణా వ్యవస్థకు ప్రాధాన్యతనిస్తూ ఈవీ బస్సుల కొనుగోలు వేగవంతం చేశామని మంత్రి తెలిపారు. APSRTC ఆస్తులను విక్రయించడం కానీ, సంస్థను ప్రైవేట్ పరం చేయడం కానీ జరగదని... కార్మికులు, ప్రయాణికులే తమకు రెండు కళ్లని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒకేసారి 16 బస్సులను ఛార్జింగ్ చేసుకునేలా ఇక్కడ మౌలిక వసతులు కల్పించారు.రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా 14 కీలక ప్రాంతాల్లో ఈవీ డిపోలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. విశాఖను దృష్టిలో ఉంచుకుని సింహాచలం, గాజువాకల్లో ఈవీ డిపోలు అందుబాటులోకి తెచ్చామన్నారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ పెంచేలా వైజాగ్ నగరం నుండి ప్రత్యేక ఈవీ ఏసీ బస్సులను నడిపేందుకు ట్రయల్ రన్ పూర్తి చేశామని వెల్లడించారు."కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నంతవరకు APSRTCని ఒక ఇంచ్ కూడా ప్రైవేట్ పరం చేసే ప్రసక్తే లేదు. కేవలం పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో కొన్ని సేవలు, ఆస్తుల అభివృద్ధి మాత్రమే చేపడుతున్నాం. అన్నారు.
ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా బస్సులు నడిపినా... డ్రైవర్ మాత్రమే ఆపరేటర్ వైపు ఉంటారు, కండక్టర్ మాత్రం మన APSRTCకి చెందినవారే ఉంటారు. కార్మికుల భద్రత, సంస్థ ఆస్తుల రక్షణే మా మొదటి ప్రాధాన్యత. భవిష్యత్తులో డీజిల్, పెట్రోల్ కొరతను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ రక్షణ కోసం ఆర్టీసీ ఫ్లీట్ మొత్తాన్ని ఎలక్ట్రిఫికేషన్ వైపు తీసుకెళ్తున్నామన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు,, సింహాచలం డిపో మేనేజర్ హన్మశ్రీ జి.విజయ గీత ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.




