Anakapalli: వృద్ధురాలికి అండగా నిలిచిన పోలీసులు.. ఓటు హక్కు వినియోగం!

Anakapalli: అనకాపల్లి జిల్లా మార్టూరులో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిని పోలీసులు కుర్చీపై కూర్చోబెట్టి పోలింగ్ బూత్‌కు తీసుకెళ్లి ఓటు వేయించి మానవత్వాన్ని చాటుకున్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 5 Nov 2026 6:15 PM IST
Anakapalli
X

Anakapalli: వృద్ధురాలికి అండగా నిలిచిన పోలీసులు.. ఓటు హక్కు వినియోగం!

అనకాపల్లి జిల్లా, మార్టూరు: ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఎంత విలువైనదో చాటిచెప్పే మానవీయ ఘటన అనకాపల్లి జిల్లా మార్టూరులో చోటుచేసుకుంది. మార్టూరులో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటు వేసేందుకు వచ్చిన ఓ వృద్ధ మహిళ ఇబ్బంది పడకుండా పోలీసులు, ఎన్నికల సిబ్బంది ప్రత్యేక చొరవ చూపించారు.

వృద్ధురాలిని చైర్‌పై కూర్చోబెట్టి, పోలీసులే స్వయంగా తోడుగా నిలిచి పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లారు. ఆమె ఎలాంటి ఇబ్బందులు పడకుండా తన ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించారు. వయసు మీద పడినా ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలనే ఆమె ఆసక్తికి పోలీసులు అందించిన సహకారం పలువురి ప్రశంసలు అందుకుంది.

ఓటు హక్కు వినియోగించుకోవడంలో వృద్ధులకు అండగా నిలవడం ద్వారా పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. విధి నిర్వహణతో పాటు సామాజిక బాధ్యతను కూడా గుర్తుచేసిన ఈ ఘటన స్థానికంగా ఆకట్టుకుంది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI