Simhachalam: సింహాచలంలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు!
Simhachalam: సింహాచలంలో ఘనంగా ప్రారంభమైన సామూహిక వరలక్ష్మీ వ్రతాలు. నాలుగు విడతల్లో పూజలు, అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు.
Simhachalam: సింహాచలంలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు!
Simhachalam: ఈవో జల్లేపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మధు లత పర్యవేక్షణలో సింహాచలంలో సామూహికవరలక్ష్మీవ్రతాలుఘనంగాప్రారంభమయ్యాయి. వేద పండితులు అర్చక స్వాములు,వేద మంత్రోచ్చారణలతో సామూహిక వరలక్ష్మీ వ్రత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
వేదిక ఒకటిలో తొలి బ్యాచ్లో మహిళా భక్తులు సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో మహిళా భక్తులు వ్రతంలో పాల్గొంటున్నారు. ప్రధాన అర్చకులు వరలక్ష్మీ వ్రత విశిష్టత, ఆచరించాల్సిన విధానాన్ని వివరించి మహిళా భక్తులకు పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నాలుగు విడతల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం సమయం, వేదిక వివరాలను ఎస్ఎంఎస్ ద్వారా ముందుగానే తెలియజేశారు. సామూహిక వరలక్ష్మీ వ్రతాలతో సింహాచల క్షేత్రంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.




