Rampachodavaram: మఠం విజయభాస్కర్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం!

Rampachodavaram: సామాజిక సేవలను గుర్తించి మఠం విజయభాస్కర్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన దక్షిణాఫ్రికా యూనివర్సిటీ.. అభినందించిన ప్రముఖులు.

Prasanna, Rampachodavaram
Published on: 20 Sept 2026 6:19 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: మఠం విజయభాస్కర్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం!

Rampachodavaram: పోలవరం జిల్లా, రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గం రాజవొమ్మంగి మండలం కిండ్ర పంచాయితీ అనంతగిరి గ్రామానికి చెందిన మఠం విజయభాస్కర్ డాక్టరెట్ పొందారు. దక్షిణాఫ్రికాలోని ఎపికైజో ప్రాఫెటిక్ బైబిల్ యూనివర్సిటీ సామాజిక సేవలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (Ph. D. ) గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. సామాజిక సేవ, నాయకత్వ రంగాల్లో చేసిన సేవలను గుర్తిస్తూ ఈ గౌరవ పురస్కారం అందించారు. విశాఖపట్నంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మఠం విజయభాస్కర్ ఈ గౌరవం అందుకున్నారు.

రంపచోడవరం శాసన సభ్యురాలు శ్రీమతి మిరియాల శిరీష దేవి భర్త అయిన మఠం విజయభాస్కర్ రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులుగా నియోజకవర్గంలో నాయికునిగా పని చేయడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేసి ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. ముఖ్యంగా సొంత వాహనాన్ని అంబులెన్స్ గా మార్చి గిరిజన ప్రాంతంలో ప్రజలకు ఉచిత సేవ అందిస్తున్నారు.

అలాగే నియోజకవర్గంలో ఆసుపత్రుల నుండి రోగులు రాకపోకలు సాగించడానికి వీలుగా ఒక ఆటో ఏర్పాటు చేసి ఉచిత సేవలు అందిస్తున్నారు. మారుమూల గిరిజన గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా లేని ప్రాంతాల్లో సొంత నిధులు నిధులతో పైప్ లైన్లు ఏర్పాటు చేసి గిరిజనులకు రక్షిత మంచినీరు అందించేందుకు ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే రాజవొమ్మంగి తో సహా పలు ప్రాంతాల్లో బస్ షెల్టర్లు నిర్మించి ప్రజలకు నీడ కల్పించడానికి సొంత నిధులను వినియోగించారు.

ఇంకా గ్రామాల్లో అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలోను, ఆర్థికంగా ఇబ్బందులు పడే వారికి ఆర్థిక సహాయం అందించి పలుసార్లు ఆదుకున్నారు. మఠం విజయ భాస్కర్ కు గౌరవ డాక్టరేట్ లభించడంపై నియోజకవర్గంలో పలువురు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ పెట్ట ప్రభాకర్ డాక్టర్ కె ఇందిరా ప్రియదర్శిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అవధానుల మురళీకృష్ణ నొక్కు భాగ్యవతి తదితరులు పాల్గొన్నారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram