Bheemili: ప్రజలను జాగృతం చేయడంలో మీడియా పాత్ర కీలకం: ఎమ్మెల్యే గంటా!
Bheemili: సమాజంలో అసమానతలను తొలగించి ప్రజలను చైతన్యపరచడంలో మీడియాది కీలక పాత్ర అని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
Bheemili: ప్రజలను జాగృతం చేయడంలో మీడియా పాత్ర కీలకం: ఎమ్మెల్యే గంటా!
భీమిలి, సెప్టెంబర్ 16: సమాజంలో అసమానతలు తొలగించి ప్రజలను జాగృతం చేయడంలో మీడియా ప్రధాన భూమిక పోషిస్తోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. భీమిలి ఉమర్ ఆలీషా ఆశ్రమంలో బుధవారం జరిగిన భర్తీ శ్రమజీవి పత్రకార్ సంఘ్ (బి.ఎస్.పి.ఎస్.) 13 వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టుల వృత్తి జీవితం కత్తి మీద సాములా మారిందని, వారిపై దాడులకు సైతం విద్రోహ శక్తులు తెగబడుతున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలతో పాటు మీడియా విశేష కృషి చేస్తోందని, నైతిక విలువలు కాపాడుతూ ముందుకు వెళ్లాలని జర్నలిస్టులకు సూచించారు.
భాగల్ పూర్ లో పోలీసుల క్రూరత్వంపై పాత్రికేయుడు అరుణ్ శౌరీ కథనాలు ప్రభుత్వాన్ని కదిలించాయన్నారు. రాజకీయాల్లోకి రాకముందు రెండేళ్లు డెక్కన్ క్రానికల్ లో పనిచేసిన సమయంలో తాను జర్నలిజానికి చాలా దగ్గరగా ఉన్నానని వెల్లడించారు.
కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త ఉమర్ అలీషా, జోనల్ కమిషనర్ ఎం. విజయ్ కుమార్, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ట్రస్టీ చెరువు రామకోటయ్య, జెడ్పీటీసీ గాడు వెంకటప్పడు, బి.ఎస్.పి.ఎస్. రాష్ట్ర అధ్యక్షుడు సూరంపూడి వీరభద్రరావు, డాక్టర్ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.




