Visakhapatnam: విశాఖలో అక్టోబర్ 3, 4న మెగా ఫెస్టివల్ షాపింగ్ ఎక్స్‌పో!

Visakhapatnam: విశాఖలో అక్టోబర్ 3, 4 తేదీల్లో మెగా షాపింగ్ ఎక్స్‌పో నోవోటెల్ బీచ్ రోడ్డులో 80 స్టాళ్లతో నిర్వహణ బ్రోచర్‌ను ఆవిష్కరించిన జాతీయ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు.

GOPI, PENDURTHI
Published on: 29 Sept 2026 11:41 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖలో అక్టోబర్ 3, 4న మెగా ఫెస్టివల్ షాపింగ్ ఎక్స్‌పో!

విశాఖపట్నం: దసరా పండుగ షాపింగ్‌ సీజన్‌ను పురస్కరించుకుని దినేష్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 3, 4 తేదీల్లో విశాఖలో మెగా ఫెస్టివల్‌ షాపింగ్‌ ఎక్స్‌పో నిర్వహించనున్నారు. నోవోటెల్‌ సమీపంలోని బీచ్‌ ప్రాంతంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయనున్న ఎక్స్‌పోకు సంబంధించిన బ్రోచర్‌ను సోమవారం సాయంత్రం జాతీయ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ.. దసరా షాపింగ్‌ సీజన్‌లో వ్యాపారులు, ప్రముఖ బ్రాండ్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, వినియోగదారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా ఎక్స్‌పోను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుమారు 80 స్టాళ్లతో కార్‌ షోరూమ్‌లు, ఆటోమొబైల్స్‌, రియల్‌ ఎస్టేట్‌, జ్యువెలరీ, మోడ్రన్‌ లివింగ్‌, హోమ్‌ ఇంటీరియర్స్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ తదితర రంగాలకు చెందిన సంస్థలు పాల్గొంటాయని పేర్కొన్నారు.

విశాఖలో తొలిసారిగా విభిన్న అనుభూతిని అందించేలా ఎక్స్‌పోను నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలకు పబ్లిసిటీ, ప్రమోషన్స్‌ కోసం దినేష్‌ ఎంటర్‌ప్రైజెస్‌ను సంప్రదించాలని సూచించారు.

ఎక్స్‌పోకు విశాఖ ఎంపీ శ్రీభరత్‌, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌, జాతీయ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వివరాలకు 87122 44589 నంబర్‌లో సంప్రదించవచ్చు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI