Visakhapatnam: నావికుడు సురేష్‌కు కన్నీటి వీడ్కోలు.. ఓదార్చిన ఎమ్మెల్యే గణబాబు
Visakhapatnam: ఓమాన్ తీరంలో భారతీయ నౌకపై జరిగిన దాడిలో మృతి చెందిన విశాఖపట్నం నావికుడు పట్నాల సురేష్ పార్థివ దేహం ఈరోజు స్వగ్రామానికి చేరుకుంది.
Visakhapatnam: నావికుడు సురేష్‌కు కన్నీటి వీడ్కోలు.. ఓదార్చిన ఎమ్మెల్యే గణబాబు
విశాఖపట్నం: ఓమాన్ తీరంలో భారతీయ నౌకపై జరిగిన దాడిలో మృతి చెందిన విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం, శ్రీహరిపురం (శ్రీనివాస్ నగర్)కు చెందిన నావికుడు పట్నాల సురేష్ పార్థివ దేహం ఈరోజు విశాఖపట్నం చేరుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మరియు స్థానిక ఎమ్మెల్యే గణబాబు సురేష్ నివాసానికి స్వయంగా వెళ్లి ఆయన భౌతిక కాయానికి పూల మాలలు వేసి ఘన నివాళు లర్పించారు.
సురేష్ అకాల మరణంతో పుట్టెడు దుఃఖం లో ఉన్న ఆయన భార్య, పిల్లలు,తల్లిదండ్రులను ఎమ్మెల్యే ఓదార్చారు. అంతకు ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ,సురేష్ పార్థివ దేహాన్ని త్వరితగతిన స్వగ్రామానికి తీసుకు వచ్చేలా గణబాబు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
ఈ కష్టసమయంలో ప్రభుత్వం మరియు తాము సురేష్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, బాధిత కుటుంబానికి రావాల్సిన సహాయం త్వరగా అందేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. సురేష్ భౌతిక కాయం ఇంటికి చేరుకోవడం తో శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి స్థానికులు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సురేష్‌కు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు.




