Araku: అరకులోయలో బర్త్ కేర్ సెంటర్ ప్రారంభం: మంత్రి గుమ్మడి సంధ్యారాణి!

Araku: అల్లూరి జిల్లా అరకులోయలో మాతా శిశు మరణాలు, డోలీ కష్టాల నివారణకు రూ.30 లక్షలతో నిర్మించిన బర్త్ కేర్ సెంటర్‌ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 24 Aug 2026 11:20 PM IST
Araku
X

Araku: అరకులోయలో బర్త్ కేర్ సెంటర్ ప్రారంభం: మంత్రి గుమ్మడి సంధ్యారాణి!

అరకు: మాతా శిశు మరణాలు తగ్గించడం, డోలి కష్టాలు కి చెక్ పెట్టేందుకు గిరిజన ప్రాంతాల్లో బర్త్ కేర్ సెంటర్స్ కి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మత శిశు మరణాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన బర్త్ వెయిటింగ్ కాలనీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు.

30 లక్షల వ్యయంతో నిర్మించిన బర్త్ కేర్ సెంటర్స్ లో ప్రసవానికి 15 రోజులకు ముందే నుండి సెల్టర్ తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేర్ సెంటర్స్ లో గర్భిణీ లకు భోజనంతో పాటు వసతి సౌకర్యం, వైద్యుల సలహాలు సూచనలను అందిస్తారూ. ఈ సెంటర్స్ ద్వారా మెరుగైన వైద్య చికిత్సలు గిరిజనలు కి అందనున్నాయి.

ఈ రోజు ప్రయోగాత్మకంగా ఈ బర్త్ కేర్ సెంటర్స్ ను మంత్రి గుమ్మడి సంధ్య రాణి ప్రారంభించారు. అదేవిధంగా అదేవిధంగా గిరిజన ప్రాంతంలో ఒకటి బై 70 చట్టాన్ని ఎవరు తొలగించబోరన్నారూ. చట్టం పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ప్రభుత్వం ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అన్నారు ఈ నెల 29న అరకులోయ మండలంలోని గన్నెల పీహెచ్డీలో సంజీవని కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్నారన్నారు తెలిపారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story