Vizag: రాష్ట్రంలో రవాణా నూతన శకం విశాఖలో ఈ-బస్సు పవర్ రూమ్ ప్రారంభం!

Vizag: విశాఖ సింహపురి ఈ-బస్సు డిపో పవర్ రూమ్‌ను ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. తొలిదశలో రాష్ట్రానికి 750 ఈ-బస్సులు, విశాఖకు 100 కేటాయింపు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 25 July 2026 1:03 PM IST
Vizag
X

Vizag: రాష్ట్రంలో రవాణా నూతన శకం విశాఖలో ఈ-బస్సు పవర్ రూమ్ ప్రారంభం!

Vizag: విశాఖలో సింహపురి ఈ-బస్సు డిపో పవర్ రూమ్‌ను ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు. విశాఖకు 100 బస్సులు కేటాయింపు. విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు వంటి నగరాలకు రానున్న ఎలక్ట్రికల్ బస్సులు.

PM e-Bus Sewa' పథకం కింద ఏర్పాటవుతున్న సింహపురి ఈ-బస్సు డిపోను పరిశీలన విశాఖకు కేటాయించిన 100 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు ఆధునిక పవర్ రూమ్ సిద్ధం.

పవర్ రూమ్‌తో పాటు సబ్‌స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్ తదితర మౌలిక సదుపాయాలు వేగంగా పూర్తి.

మరో రెండు నుంచి మూడు నెలల్లో ఈ-బస్సులు అందుబాటులోకి వస్తాయని మంత్రి వెల్లడి. ఈ-బస్సులు రాక నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం.

రాష్ట్రానికి తొలి దశలో 750 ఈ-బస్సులు... అందులో విశాఖకు 100 బస్సులు కేటాయింపు. ప్రస్తుత బస్సులతో పాటు కొత్త ఈ-బస్సులతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తాం..

పర్యావరణ హిత, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం. కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు APSRTC ని అని ప్రైవేట్ పరం చేయడం లేదు..అపోహలకు తావులేదు.

ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి జి. విజయగీత, విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీ బి. అప్పలనాయుడు, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్లు, ఆర్టీసీ ఇంజినీర్లు, డిపో మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులు, వివిధ ఆర్టీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story