Visakhapatnam: రేపు విశాఖలో మంత్రి నారా లోకేశ్ విస్తృత పర్యటన!

Visakhapatnam: మంత్రి నారా లోకేశ్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. రూ.2,000 కోట్ల ఏఐజీ ఆసుపత్రి శంకుస్థాపనతో పాటు రోశయ్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు.

SHIVA, BHIMILI
Published on: 30 Aug 2026 7:01 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: రేపు విశాఖలో మంత్రి నారా లోకేశ్ విస్తృత పర్యటన!

విశాఖ, మధురవాడ: రాష్ట్ర ఐటీ, విద్య, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం విశాఖ జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. 2,000 కోట్లతో ఏఐజీ ఆసుపత్రి. మధురవాడ పనోరమ హిల్స్ నుండి - ఎండాడ మార్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఏఐజీ ఆసుపత్రికి మంత్రి శంకుస్థాపన చేస్తారు.

1,000 పడకలు,50కి పైగా ప్రత్యేక వైద్య విభాగాలతో రూ.2 వేల కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 9,000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ​రోశయ్య విగ్రహావిష్కరణ. పోర్టు గెస్ట్ హౌస్ సమీపంలో (వాల్తేర్ క్లబ్ గేటు ఎదురుగా) ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి దివంగత కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

​కళాశాల,సేవా భవనాల ప్రారంభం.. గంభీరం ఐఐఎం సమీపంలో ప్రేమ గ్రూప్ ఇన్ స్టిట్యూషన్స్ నూతన కళాశాల భవనంతో పాటు ఏజ్ కేర్ ఫౌండేషన్ నూతన భవనాలను ప్రారంభిస్తారు. ​ఉదయం భోగాపురం విమానాశ్రయం చేరుకునే మంత్రి, రోజంతా వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం విజయవాడ తిరుగు ప్రయాణమవుతారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story