Anakapalli: కే.కోటపాడులో బావిలోకి దూకి మైనర్ ప్రేమికుల ఆత్మహత్య!
Anakapalli: కే.కోటపాడులో తీవ్ర విషాదం. పైడమ్మ చెరువు బావిలోకి దూకి పెందుర్తికి చెందిన మైనర్ ప్రేమికుల జంట ఆత్మహత్య. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.
Anakapalli: కే.కోటపాడులో బావిలోకి దూకి మైనర్ ప్రేమికుల ఆత్మహత్య!
Anakapalli: అనకాపల్లి జిల్లా కె.కోటపాడులో బావిలో దూకి ప్రేమికుల జంట బల వన్మరణానికి పాల్పడ్డారు. వీరిద్దరూ మైనర్లే. కె.కోటపాడు పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ నగరంలోని పెందు ర్తికి చెందిన 17 ఏళ్ల యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను తల్లిదండ్రులు అంగీకరిం చకపోవడంతో గతంలో పలుమార్లు ఇళ్ల నుంచి వెళ్లిపోయారు.
కుటుంబ సభ్యులు పెందుర్తి స్టేషన్ ను ఆశ్రయించగా పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. మేజర్లు అయిన తరువాత పెళ్లి చేస్తామని కుటుంబీకులు చెప్పినా లెక్క చేయకుండా ఇటీవల ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో గురువారం యువకుడి అమ్మమ్మ గ్రామమైన కె.కోటపాడు వచ్చి ఊరికి దూరంగా ఉన్న పైడమ్మ చెరువు సమీప బావిలోకి దూకి ఆత్మ హత్య చేసుకున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ను పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు "కె.కోటపాడు ఎస్ఐ ధనుంజయ తెలిపారు. మృతుల్లో యువకుడు పెందుర్తిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువు తుండగా, యువతి మొదటి ఏడాది చదివి మానేసింది.




