Anakapalli: కొండపై కుళ్లిపోయిన స్థితిలో వ్యక్తి మృతదేహం!
Anakapalli: అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం పల్లపు కొడాబు గ్రామంలో విషాదం. జూన్ 30న కట్టెల కోసం కొండపైకి వెళ్లి అదృశ్యమైన జెట్టి దేముడు మృతి.
Anakapalli: కొండపై కుళ్లిపోయిన స్థితిలో వ్యక్తి మృతదేహం!
Anakapalli: అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి మండలం, తామరబ్బ గ్రామ పంచాయతీ పరిధిలోని పల్లపు కొడాబు గ్రామానికి చెందిన జెట్టి దేముడు (S/o భీమన్నదొర) అనే వ్యక్తి 30-06-2026 తేదీ మధ్యాహ్నం సుమారు 01.30 గంటలకు కట్టెలు తీసుకురావడానికి గ్రామ సమీపంలోని కొండపైకి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు.
దీంతో అతని భార్య జెట్టి చిన్నమ్మలు మరియు కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లతో పాటు పరిసర గ్రామాలలో విస్తృతంగా గాలించినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. అనంతరం 06-07-2026 తేదీన జెట్టి చిన్నమ్మలు దేవరాపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ రోజు (10-07-2026) ఉదయం సుమారు 07.00 గంటలకు జెట్టి చిన్నమ్మలు దేవరాపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చి, తన భర్త గ్రామ సమీపంలోని కొండపై మృతదేహంగా కనిపించాడని, మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసన వస్తోందని సమాచారం అందించారు.
ఈ సమాచారంపై దేవరాపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అక్కడే పోస్టుమార్టం చేయడమైనది.




