Visakhapatnam: గోతికాడ నక్కలా వైసీపీ.. ఎన్డీఏ నేతల తీవ్ర ధ్వజమెత్తు!
Visakhapatnam: విశాఖ పశ్చిమంలో ఎమ్మెల్యే గణబాబు ఎన్డీఏ సమావేశం నిర్వహించారు. వైకాపా 'సేవ్ వైజాగ్'పై మండిపడుతూ కూటమితోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.
Visakhapatnam: గోతికాడ నక్కలా వైసీపీ.. ఎన్డీఏ నేతల తీవ్ర ధ్వజమెత్తు!
Visakhapatnam: విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో ఎన్డీఏలో కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న వారితో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో టిడిపి జనసేన బిజెపి కార్పొరేటర్లు మరియు ఎమ్మెల్యే పాల్గొన్నారు..
గణబాబు కామెంట్స్:
వైసీపీ నాయకులు సేవ్ ద వైజాగ్ అని అంటున్నారు ప్రజలే మీ నుండి 2024 ఎన్నికల్లో విశాఖపట్నం ని ఆంధ్రప్రదేశ్‌ని సేవ్ చేసుకున్నారు...గత ప్రభుత్వం ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టింది...
సేవ్ ద వైజాగ్ అనే నినాదంతో వెళ్తున్నారు గత ప్రభుత్వం స్పష్టత లేని హామీలతో మావిగన్ అన్నారు రాజధాని విశాఖపట్నం అన్నారు వీరిని నమ్మి పరిస్థితుల్లో ప్రజలు లేరు...
ఎన్డీఏ ప్రభుత్వం ఏకైక లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో నిలబెట్టడమే జనసేన టిడిపి బిజెపి మధ్య ఎటువంటి గొడవ జరిగిన గోతి కాడ నక్కలాగా వైసిపి ప్రభుత్వం దాన్ని లబ్ధి పొందడానికి చూస్తుంది...అటువంటి అవకాశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం వారికి ఇవ్వదు...
విషన్ 20-20 ఫలాలు తెలంగాణ ఎలా డెవలప్ అయిందో ప్రజల ఆలోచిస్తున్నారు అక్కడక్కడ వైసీపీకి ఓటు వేసిన వారు కూడా ఇప్పుడు కూటమిపై మొ గ్గుచూపుతున్నారు...దావోస్ నుంచి 500కు పైగా కంపెనీలను పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాయి
గత ప్రభుత్వం లో చెత్త పై పన్ను వేసి అదే ఆదాయం అనుకున్నారు ...గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు ఆ యాక్ట్ కి ఎక్కువ బయ పడింది విశాఖ ప్రజలు...స్టీల్ ప్లాంట్ ని సేవ్ చేసింది ఎన్ డి ఏ ప్రభుత్వం...
11 వేల కోట్లకు పైగా నిధులను తీసుకువచ్చి స్టీల్ ప్లాంట్ ని రన్ చేస్తున్నారు...రాజకీయ పార్టీలుగా బురద చల్లడానికి వైసిపి ప్రభుత్వం చూస్తుంది.....విశాఖపట్నం రాజధాని చేయడం అంటే భూములను తాకట్టు పెట్టు రాజధాని చేయడమా.....
ప్రపంచమంతా గూగుల్ వైపు చూస్తుంది గూగుల్ విశాఖపట్నం వైపు చూస్తుంది దాన్ని రాజకీయం చేస్తున్నారంటే ఏమనుకోవాలి...ఫ్యూచర్ జనరేషన్ కి విశాఖపట్నం సెంటర్ కాబోతుంది.....
పేద ప్రజలకు ఐదు రూపాయలు తో పెట్టే అన్న క్యాంటీన్ కూడా రన్ చేయలేకపోయారు..... మీరు వేసే ఓటు వైజాగ్ భవిష్యత్తుకు వేసే ఓటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు వేసే ఓటు దాన్ని మీరు గుర్తుంచుకోవాలని కోరుచున్నాను....




