Visakhapatnam: విశాఖపశ్చిమలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ!

Visakhapatnam: విశాఖపశ్చిమ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గణబాబు ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు.

GOPI, PENDURTHI
Published on: 1 Oct 2026 12:58 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖపశ్చిమలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ!

Visakhapatnam: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, విశాఖపశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) అన్నారు. గురువారం విశాఖపశ్చిమ నియోజకవర్గంలోని 89వ వార్డు పరిధి కార్వెల్‌నగర్, సాయినగర్, సూర్యనగర్, కొత్తపాలెం ప్రాంతాల్లో నిర్వహించిన ‘పేదల సేవలో’ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గణబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర లబ్ధిదారులను పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందిస్తోందన్నారు. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4,000, దివ్యాంగులకు వైకల్యం ఆధారంగా రూ.6,000 నుంచి రూ.10,000 వరకు, తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న వారికి రూ.15,000, డయాలసిస్ చేయించుకుంటున్న వారికి రూ.10,000 చొప్పున పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి నెలా ఒకటో తేదీన లబ్ధిదారుల గడప వద్దకే వెళ్లి పింఛన్ అందించడం ద్వారా ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు.

కాలనీల పర్యటన సందర్భంగా స్థానికులు ప్రస్తావించిన డ్రైనేజీ, రహదారులు, ఇతర మౌలిక వసతుల సమస్యలపై ఎమ్మెల్యే స్పందించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ హేమవతి, ఏపీడీ చిరంజీవి, ఈఈ మాధవ్, స్థానిక కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, వార్డు కార్యదర్శులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI