Simhachalam: సింహాచలంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గంటా శంకుస్థాపన!

Simhachalam: జీవీఎంసీ 98వ వార్డు పరిధిలో రూ. 2.77 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు.

GOPI, PENDURTHI
Published on: 15 Jun 2026 4:10 PM IST
Simhachalam
X

Simhachalam: సింహాచలంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గంటా శంకుస్థాపన!

Simhachalam: జీవీఎంసీ 98 వార్డులో రూ.2.77 కోట్లతో ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు అడవివరం కాపుదిబ్బ వద్ద భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింహాద్రి అప్పన్న దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు, పర్యాటకులు వస్తారని రూ. 1.25 కోట్లతో తొలిపావంచ వద్ద అభివృద్ధి, సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టామని తెలియజేశారు.

అలాగే వార్డు కార్యాలయం, రోడ్లు, డ్రెయిన్ల కోసం మరో రూ.1.50 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండేళ్లలో మధురవాడ జోన్ లో మౌలిక వసతులు కల్పన కోసం రూ. 200 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించామని వివరించారు.

కార్యక్రమంలో కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, పీవీ నరసింహం, పంచదార్ల శ్రీనివాస్, గుసిడి శంకర్రావు, బూర్ల కనకారావు, అవినాష్, రాజు, సూరిబాబు, ముగ్గు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story