Bheemili: భీమిలి, మధురవాడల్లో తాగునీటి కొరత లేకుండా చర్యలు!

Bheemili: భీమిలి మధురవాడ జోన్లలో తాగునీటి ఎద్దడి నివారణకు తాటిపూడి జలాల విడుదలపై మంత్రి నారాయణతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చర్చించారు.

SHIVA, BHIMILI
Updated on: 10 Sept 2026 4:31 PM IST
Bheemili
X

Bheemili: భీమిలి, మధురవాడల్లో తాగునీటి కొరత లేకుండా చర్యలు!

Bheemili: మధురవాడ, భీమిలి జోన్ లలో తాగునీటి సమస్య తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. గురువారం ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో జీవీఎంసీ అధికారులతో తాగునీటి ఎద్దడిపై ఆయన సమీక్ష నిర్వహించారు.

తాటిపూడి రిజర్వాయర్ విషయంలో తాగు నీటికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విశాఖకు నీటి విడుదల అంశంపై విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లు మాట్లాడుకుని ప్రాధాన్యాలు నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని మంత్రి నారాయణకు వివరించి.. మధురవాడ, భీమిలి జోన్ లలో నెలకొన్న నీటి కొరత తీరడానికి తాటిపూడి జలాలు అత్యావశ్యకమని తెలియజేశారు. విశాఖకు గోదావరి నీరు చేరినా తాగు నీటి సరఫరా మెరుగుపడక పోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

మధురవాడ అవసరాల కోసం రూ.550 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు పూర్తయితే గోదావరి నీరు అందుబాటులోకి వచ్చి.. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం వస్తుందని అధికారులు వివరించారు. వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడం కూడా సమస్య తీవ్రత పెంచిందని తెలిపారు. అలాగే 4 వ వార్డులో మంచినీటి ఎద్దడి నివారణకు రూ.4 కోట్లతో సిద్ధం చేసిన ప్రాజెక్టు డిజైన్లు చూపించారు. వాటర్ సప్లై ఎస్.ఇ. పల్లంరాజు, ఈఈ సుధాకర్, జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story