Visakhapatnam: భీమిలిలో రూ.11.47 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన గంటా!
Visakhapatnam: భీమిలి నియోజకవర్గంలో 20 మంది లబ్ధిదారులకు రూ.11.47 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే ఎంవీపీ కాలనీ కార్యాలయంలో అందజేశారు.
Visakhapatnam: భీమిలిలో రూ.11.47 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన గంటా!
Visakhapatnam: భీమిలి నియోజకవర్గంలో 20 మంది లబ్ధిదారులకు రూ. 11.47 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం ఎంవీపీ కాలనీ క్యాంప్ ఆఫీస్ లో అందజేశారు. 8, 11, 120 వార్డుల్లో ముగ్గురేసి.. 3, 4, 10 వార్డుల్లో ఇద్దరు చొప్పున లబ్ధిదారులకు అందించారు.
అలాగే 1, 5, 6, 7, వార్డుల్లో ఒక్కొక్కరికి రిలీఫ్ ఫండ్ చెక్కులిచ్చారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.
కష్టాల్లో ఉన్న వారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేగంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేస్తున్నామని చెప్పారు.
కార్యక్రమంలో కార్పొరేటర్లు గరే సదానంద, గాడు చిన్ని కుమారి లక్ష్మి, గరే జ్యోతి, పీవీ నరసింహం, శాఖారి శ్రీనివాస్, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, దండి వెంకటేష్, గరే గుర్నాథ్, తమ్మిన సూరిబాబు, కొప్పల రమేష్, గంటా నూకరాజు, గొలగాని నరేంద్ర, గరికిన ఎల్లాజీ, పోలిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.




