Visakhapatnam: ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలి భీమిలి ఎమ్మెల్యే గంటా

Visakhapatnam: భీమిలిలో 3 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకుని 100% స్ట్రైక్ రేట్ సాధించామన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఎంవీపీ కాలనీ కార్యాలయంలో విజేతలకు ఘన సత్కారం.

SHIVA, BHIMILI
Published on: 9 Nov 2026 8:30 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలి భీమిలి ఎమ్మెల్యే గంటా

విశాఖపట్నం: ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటూ ప్రభుత్వానికి, ప్రజలకు మంచి పేరు తేవాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీ అభ్యర్థులు ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిశారు.

విజేతలతో పాటు కూటమి పార్టీల మద్దతుదారులు పెద్దఎత్తున రావడంతో కార్యాలయం జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలిచ్చిన తీర్పు మరింత బాధ్యత పెంచిందని చెప్పారు.

నియోజకవర్గం పరిధిలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం జెడ్పీటీసీలు మూడూ గెలుచుకుని 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించామని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో తిరుగులేని విజయాన్ని అందుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు.

విజేతలకు, గెలుపు కోసం పని చేసిన కూటమి పార్టీల శ్రేణులకు అభినందనలు తెలిపారు. జెడ్పీటీసీలుగా గెలిచిన గాడు అలివేణి, కోరాడ సత్యవతి, ఎన్ని శ్రీనివాసరావు, ఎంపీపీ అభ్యర్థులు తాట్రాజు అప్పారావు, కుచ్చర్లపాటి అరుణ కుమారి, యరబాల కృష్ణవేణిలను శాలువాలతో సత్కరించారు.

కార్యక్రమంలో జనసేన భీమిలి ఇంచార్జ్ పంచకర్ల సందీప్, టీడీపీ ఇంచార్జ్ చిక్కాల విజయ్ బాబు, గాడు వెంకటప్పడు, యరబాల అనిల్ ప్రసాద్, సరగడ అప్పారావు, కోరాడ రమణ, కసిరెడ్డి దామోదరరావు, కాళ్ల నగేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI