Anandapuram: ఆనందపురంలో ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు!
Anandapuram: ఆనందపురంలో రూ.77 లక్షలతో నూతనంగా నిర్మించిన పబ్లిక్ హెల్త్ యూనిట్, విలేజ్ హెల్త్ క్లినిక్‌లను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు.
Anandapuram: ఆనందపురంలో ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు!
Anandapuram: ఆనందపురంలో రూ.50 లక్షలతో నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ ను.. రూ. 27 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ ను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు. పబ్లిక్ హెల్త్ యూనిట్ లో వెయిటింగ్ హాల్, ఆఫీస్, స్టోర్ రూం, ల్యాబ్, వాష్ రూంలు ఉంటాయి. వైద్య సౌకర్యాల గురించి రోగులను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఆస్పత్రుల్లో సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు.
ఎంపీపీ స్కూల్ ఆకస్మిక తనిఖీ
ఆనందపురం ఎంపీపీ మోడల్ స్కూల్ ను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతి గదిలో విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు. గురజాడ అప్పారావు రాసిన దేశమంటే మట్టి కాదోయ్.. పద్యాన్ని చెప్పించారు. గతంలో 62 మంది విద్యార్థులుండగా ఈ ఏడాది మరో ఇద్దరు పెరిగారని ఉపాధ్యాయులు తెలిపారు. మధ్యాహ్న భోజనం సమయానికి పెడుతున్నారా అని ఆరా తీశారు. విద్యార్థులకు ఇచ్చే చిక్కీని రుచి చూశారు. పాఠశాల భవనం పెచ్చులూడడాన్ని చూసి తక్షణమే మరమ్మత్తు చేయించాలని ఆదేశించారు.




