Madhurawada: మధురవాడలో నిర్మాణ పనులను పరిశీలించిన భీమిలి ఎమ్మెల్యే!

Madhurawada: మధురవాడలో జీవీఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కళ్యాణమండపాలు, వాటర్ ట్యాంక్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని భీమిలి ఎమ్మెల్యే ఆదేశించారు.

SHIVA, BHIMILI
Published on: 25 Aug 2026 3:24 PM IST
Madhurawada
X

Madhurawada: మధురవాడలో నిర్మాణ పనులను పరిశీలించిన భీమిలి ఎమ్మెల్యే!

Madhurawada: జీవీఎంసీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణమండపాలు,వాటర్ ట్యాంక్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు.మంగళవారం ఆయన జీవీఎంసీ మధురవాడ జోన్ 5వ వార్డు సాయిరాం కాలనీ,6వ వార్డు కొమ్మాది గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న కళ్యాణమండపాలను పరిశీలించారు.

​అనంతరం సాయిరాం కాలనీలో నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ పనులను వేగవంతం చేయాలని జీవీఎంసీ అధికారులకు సూచించారు.సర్వే నంబర్ 3లోని ప్రభుత్వ స్థలం ఆక్రమణను పరిశీలించిన ఆయన,ఆ స్థలాన్ని కళ్యాణమండపం పార్కింగ్‌కు కేటాయించాలని స్థానికులు కోరగా సానుకూలంగా స్పందించారు.త్వరలోనే అన్ని వసతులతో వీటిని ప్రారంభగిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో స్థానిక నాయకులు మొల్లి లక్ష్మణరావు,గరే గురునాథ్,నమ్మి రమణ,నాగోతి సత్యనారాయణ,నోడగల జానకిరామ్,కానూరి అచ్యుతరావు,జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు,డి.ఈ. మణికుమార్ తదితరులు పాల్గొన్నారు

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story