Madhurawada: అంబేద్కర్ గురుకులంలో 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్రా' ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యే గంటా
Madhurawada: జీవీఎంసీ 6వ వార్డు అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్రా' కార్యక్రమంలో పాల్గొన్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.
Madhurawada: అంబేద్కర్ గురుకులంలో 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్రా' ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యే గంటా
మధురవాడ: జీవీఎంసీ 6వ వార్డు రిక్షా కాలనీలోని అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్రా కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఎంపిక చేసిన "ఆరోగ్య పాఠశాలలు - ఆరోగ్య ఆంధ్రా" అంశంలో భాగంగా పాఠశాలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో స్వచ్ఛాంధ్రా ప్రతిజ్ఞ చేయించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చేలా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు శిక్షణనివ్వాలని గంటా పేర్కొన్నారు.
627 మంది విద్యార్థులున్న పాఠశాలలో ఫలితాలు, సౌకర్యాల గురించి ఆరా తీశారు. హాస్టల్ లో నీటి సమస్య గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే బోరు ఏర్పాటు చేయాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. అనంతరం పాఠశాల ఆవరణలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు.
జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, ఏ.ఎం.హెచ్.ఓ. రాజా రవికుమార్, ప్రిన్సిపాల్ రత్నకుమారి, వైస్ ప్రిన్సిపాల్ శాంతకుమారి, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, లొడగల జానకిరాం, పోలిశెట్టి నాగేశ్వరరావు, మన్యాల సురేష్, తదితరులు పాల్గొన్నారు.




