Visakhapatnam: జా సమస్యలపై ఎమ్మెల్యే గంటా కీలక ఆదేశాలు!
Visakhapatnam: విశాఖపట్నంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.
Visakhapatnam: జా సమస్యలపై ఎమ్మెల్యే గంటా కీలక ఆదేశాలు!
విశాఖపట్నం: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యమిస్తోందని, అందులో భాగంగానే అధికారులు పాల్గొనే వేదికలే కాకుండా ఎమ్మెల్యేలు కూడా ప్రతి వారం పీజీఆర్ఎస్ లను నిర్వహిస్తున్నట్టు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో శనివారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఆయన నిర్వహించారు.
ప్రజల విజ్ఞాపనలపై అధికారులు తక్షణమే స్పందించాలని.. సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజలకు ప్రభుత్వం అండగా ఉందన్న భరోసా కల్పించాలని సూచించారు. సింహాచలం బీఆర్టీఎస్ రోడ్డు నిర్మాణంలో కూల్చివేసిన ఇళ్ల పునర్నిర్మాణ ప్రయత్నాలను సింహాచలం దేవస్థానం అధికారులు అడ్డుకుంటున్న విషయాన్ని బాధితులు ఎమ్మెల్యే గంటా దృష్టికి తీసుకువచ్చారు.
రోడ్డు కోసం స్థలమిచ్చి రోడ్డున పడ్డామని, మూడేళ్లుగా అద్దె ఇళ్లల్లో తల దాచుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై గంటా స్పందిస్తూ తొలగించిన కట్టడాలకు జీవీఎంసీ పరిహారాన్ని పొందిన వారు పునర్నిర్మాణం చేసుకోవచ్చని.. ఆ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీఆర్టీఎస్ రోడ్డులో 41 టీడీఆర్ ల సేల్ ఆప్షన్ లు వెంటనే ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న వందకు పైగా టీడీఆర్ లు త్వరితగతిన జారీ చేయాలని ఏసీపీ శాస్త్రిని ఆదేశించారు.
చిన్న రుషికొండ లో తొలగించిన 50 మంది చిల్లర వర్తకులకు న్యాయం చేయాలని, ఎండాడ బంగారమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లే రహదారి సమస్య పరిష్కరించాలని ఆయా ప్రాంతవాసులు కోరారు. ఆనందపురం జట్లమ్మ కొండ వద్ద ఇళ్లు కోల్పోయిన వారికి స్థలాలు మంజూరు చేయాలని అభ్యర్థించారు.
8 వ వార్డు సన్ కాలేజీ వద్ద మాస్టర్ ప్లాన్ రోడ్డు పనులను తక్షణమే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. తిమ్మాపురం, మధురవాడ ప్రాంతాల్లో ఆక్రమణలు అరికట్టాలని, పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని వినతి పత్రాలను సమర్పించారు. పీజీఆర్ఎస్ లో 11 రెవిన్యూ, 4 హౌసింగ్, 4 పురపాలక శాఖ వినతులు అందాయి.




