Visakhapatnam: విశాఖలో పెట్టుబడుల వరద పారుతోంది: ఎమ్మెల్యే గంటా!

Visakhapatnam: విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, జెడ్పీ సహా అన్ని స్థానాల్లో గెలుస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు.

SHIVA, BHIMILI
Published on: 14 Sept 2026 9:23 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖలో పెట్టుబడుల వరద పారుతోంది: ఎమ్మెల్యే గంటా!

విశాఖపట్నం, సెప్టెంబర్ 14: స్థానిక ఎన్నికల్లో మేయర్, జెడ్పీ చైర్మన్ సహా అన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ స్థానాలు ఏకపక్షంగా కైవసం చేసుకుంటామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. వినాయకచవితి పురస్కరించుకుని సంపత్ వినాయగర్ దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. టీడీపీ పరిశీలకునిగా విశాఖ వచ్చిన షరీఫ్ ఇప్పటికే స్థానిక నాయకత్వంతో సమావేశమై రాజకీయ అంశాలపై చర్చించారని తెలిపారు.

వ్యక్తులను దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్లు ఖరారు చేయరని.. రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకుని రిజర్వేషన్లు నిర్ణయిస్తారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటున్న వినాయక చవితి అందరికీ శుభాలు కల్గించాలన్నారు. పని చేసే కూటమి ప్రభుత్వం. విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీల కాంబినేషన్ లో రాష్ట్రానికి పెట్టుబడుల వరద పేరుతోందని పేర్కొన్నారు.

దేశంలో మూడో వంతు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు, అందులో మూడో వంతు విశాఖకు వస్తున్నాయన్నారు. ఉత్తరాంధ్ర గ్రోత్ ఇంజన్ భోగాపురం ఎయిర్ పోర్టు, ఆంధ్రుల కల పోలవరాన్ని సాధించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. విశాఖలో 16 ఫైవ్ స్టార్ హోటల్స్ నిర్మాణంలో ఉన్నాయని, రెండేళ్లలో 3 వేల గదులు రెండేళ్లలో అందుబాటులోకి వస్తాయన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI