Simhachalam: సింహాచలంలో ఎస్.కోట ఎమ్మెల్యే లలిత కుమారి.. కప్పస్తంభం వద్ద మొక్కులు!

Simhachalam: సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి దంపతులు.

GOPI, PENDURTHI
Published on: 15 May 2026 7:36 PM IST
Simhachalam
X

Simhachalam: సింహాచలంలో ఎస్.కోట ఎమ్మెల్యే లలిత కుమారి.. కప్పస్తంభం వద్ద మొక్కులు!

​సింహాచలం:​ శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానాన్ని శృంగవరపుకోట (ఎస్.కోట) శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి, వారి దంపతులు మరియు కుటుంబ సభ్యులు శుక్రవారం సందర్శించారు. ​ఆలయానికి విచ్చేసిన శాసనసభ్యురాలి కుటుంబానికి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె. వెంకట్రావు ఆదేశాల మేరకు ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధ, ప్రోటోకాల్ పర్యవేక్షణ అధికారి ఏ త్రిమూర్తులు, ఆలయ పర్యవేక్షణ అధికారి కె. వెంకటేశ్వరరావు మరియు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.

దర్శనంలో భాగంగా కోళ్ల లలిత కుమారి దంపతులు మొదటగా ఆలయంలో అత్యంత మహిమాన్వితమైన ‘కప్పస్తంభమును’ ఆలింగనం చేసుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం గర్భాలయంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు వారికి మంత్రపుష్పాలతో వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి శేష వస్త్రాన్ని కప్పి ఘనంగా సత్కరించారు. స్వామివారి పవిత్ర ప్రసాదాలతో పాటు, జ్ఞాపికగా శ్రీవారి దివ్య సుందర చిత్రపటాన్ని వారికి అందజేశారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story