Anakapalli: అనకాపల్లిలో ఎన్టీఆర్–బాలకృష్ణ బస్ స్టాప్ ప్రారంభం!

Anakapalli: అనకాపల్లిలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్-బాలకృష్ణ బస్ స్టాప్‌ను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రారంభించారు. పట్టణంలో మరిన్ని బస్ షెల్టర్లు కడతామన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Updated on: 4 July 2026 5:39 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లిలో ఎన్టీఆర్–బాలకృష్ణ బస్ స్టాప్ ప్రారంభం!

అనకాపల్లి: అనకాపల్లి పట్టణంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో నూతనంగా నిర్మించిన మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు–బాలకృష్ణ బస్ స్టాప్‌ను మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే శ్రీ కొణతాల రామకృష్ణ శనివారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో APUFIDC చైర్మన్ శ్రీ పీలా గోవింద సత్యనారాయణ, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, ఇంచార్జ్ జోనల్ కమిషనర్ తులసితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తమ స్వచ్ఛంద సహకారంతో NTR–బాలకృష్ణ బస్ స్టాప్‌ను నిర్మించిన దాతలను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, అనకాపల్లి పట్టణంలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని ఆధునిక బస్ షెల్టర్ల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పట్టణ ప్రవేశ ప్రాంతమైన జలగలమధుం వద్ద విద్యార్థులు, ప్రజలు బస్సుల కోసం రోడ్డుపై వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని, అక్కడ త్వరలోనే ఆధునిక బస్ షెల్టర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

అదేవిధంగా గుండాల జంక్షన్ వద్ద ఒక బస్ షెల్టర్, రైల్వే స్టేషన్ సమీపంలో మరో బస్ షెల్టర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు ఈ పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ నూతన బస్ షెల్టర్ వద్ద బస్సు ఎక్కి ప్రయాణించి ప్రజలతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, ఎన్టీఆర్–బాలకృష్ణ అభిమానులు, కూటమి నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story