Anakapalli: జీవీఎంసీ 110వ వార్డులో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ జోరుగా ఎన్నికల ప్రచారం!

Anakapalli: అనకాపల్లి జీవీఎంసీ 110వ వార్డులో కూటమి ప్రచార హోరు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే , కార్పొరేటర్ అభ్యర్థి తాడి శాంతికుమారితో కలిసి వేల్పుల వీధిలో ఇంటింటి విస్తృత ప్రచారం.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 30 Oct 2026 1:03 PM IST
Anakapalli
X

Anakapalli: జీవీఎంసీ 110వ వార్డులో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ జోరుగా ఎన్నికల ప్రచారం!

Anakapalli: అనకాపల్లి జీవీఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 110వ వార్డులో కూటమి ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ఈ సందర్భంగా వేల్పుల వీధి సహా పరిసర ప్రాంతాల్లో కూటమి కార్పొరేటర్ అభ్యర్థి తాడి శాంతి కుమారితో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుంటూ వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు మద్దతుగా నిలవాలని, స్థానికంగా మరింత అభివృద్ధి జరగాలంటే కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ స్వయంగా ప్రచారంలో పాల్గొనడంతో 110వ వార్డులో ఎన్నికల సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో 110వ వార్డు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI