Anakapalli: అనకాపల్లిలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ!

Anakapalli: అనకాపల్లి నియోజకవర్గం గవరపాలెంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. సంక్షేమ పథకాల అమలుపై ప్రజలకు వివరించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 1 Sept 2026 10:22 AM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లిలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ!

Anakapalli: అనకాపల్లి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం గవరపాలెం ప్రాంతంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేదలు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా పింఛన్లను పెంచి అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు.

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలోని 80, 81వ వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.

పింఛన్ అందుకున్న దివ్యాంగ లబ్ధిదారులు మాట్లాడుతూ.. పింఛన్ పెంపుతో తమకు ఆర్థికంగా ఎంతో భరోసా కలిగిందన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, APUFIDC చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, అనకాపల్లి జోనల్ కమిషనర్ చక్రవర్తి, ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story