Chodavaram: చోడవరంలో మెగా జాబ్ మేళా.. ప్రారంభించిన ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజు!
Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Chodavaram: చోడవరంలో మెగా జాబ్ మేళా.. ప్రారంభించిన ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజు!
చోడవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా చోడవరం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గం శాసనసభ్యులు కె ఎస్ ఎన్ ఎస్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా వివిధ ట్రైనింగ్ కార్యక్రమాలు మరియు మెగా జాబ్ మేళాలను నిర్వహించటం వలన స్థానిక నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని.
ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్విని చేసుకొని వారికి నచ్చిన కంపెనీకి అటెండ్ అయ్యి వారు సెలక్ట్ అవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ స్థానికంగానే కాకుండా ఎక్కడ జాబ్ వస్తే అక్కడ జాయిన్ అయి ఆ ఆదాయంతో కుటుంబాన్ని తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.
నిరుద్యోగ యువతీ యువకులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది, మరియు ఈరోజు జరిగిన జాబ్ మేళా లో ఎవరికైనా దురదృష్టం కొద్ది జాబ్ రాకపోయినా నిరుత్సాహపడకుండా భవిష్యత్తులో మరిన్ని జాబ్ మేళాలో చోడవరం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించడానికి తన వంతు కృషి చేస్తానని.... నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి. రోహిణి మాట్లాడుతూ ఈరోజు జరిగినటువంటి జాబ్ మేళాకు సుమారుగా 15 ఎమ్మెన్సీ కంపెనీలు హాజరయ్యాయని అలాగే 1500 ఖాళీలు వివిధ కంపెనీలో ఉన్నాయని మరియు ఈరోజు జరుగుతున్నట్టు ఈ జాబ్ మేళాకు 10వ తరగతి నుండి పీజీ వరకు అలాగే ఐటి డిప్లమో బీటెక్ బి బి ఏ ఎం బి ఏ బి ఏ బీకాం బీఎస్సీ కి సంబంధించి ప్రతి ఒక్క నిరుద్యోగి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానికంగా కానీ మరియు ఇతర ప్రదేశాల్లో కూడా ఉద్యోగ అవకాసం పొందినటువంటి వారు నియామకం పత్రం తీసుకున్న ప్రతి వ్యక్తి ఆ కంపెనీలో జాయిన్ అవ్వాలని,అది దూరమా దగ్గరని చూడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసారు.
ఈ రోజు జాబ్ మేళాలో 15 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొనగ 145 మంది నిరోద్యోగ యువతీ, యువకులు హాజరువ్వగ 59 మంది వివిధ కంపెనీ లకు ఎంపిక కావటం జరిగింది, ఈ యొక్క కార్యక్రమం లో, కాలేజీ ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ , టి డి పి యువ నాయకులు సకురు కోటేశ్వరరావు , నౌడు సుధాకర్ మరియు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.




