Gajuwaka: రైతులకు పెట్టుబడి సాయం.. గాజువాకలో మెగా చెక్కు పంపిణీ!

Gajuwaka: గాజువాక 88వ వార్డు మంగళపాలెంలో పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ కార్యక్రమం.

ANIL, VIZAG CITY
Updated on: 20 Jun 2026 8:50 PM IST
Gajuwaka
X

Gajuwaka: రైతులకు పెట్టుబడి సాయం.. గాజువాకలో మెగా చెక్కు పంపిణీ!

గాజువాక: గాజువాక 88వ వార్డు మంగళపాలెం ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో పియం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా టిడిపి రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతలకు పెట్టుబడి సాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరానికి మూడు విడతల్లో ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నాయని అన్నారు. ఈ సంవత్సరం తొలి విడతగా ఏడు వేల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ అయ్యాయని తెలిపారు.

ప్రధాని మోదీ పచ్చిమ బెంగాల్ నుండి,సియం చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి బటన్ నొక్కి డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేశారని తెలిపారు. కార్యక్రమంలో బిజేపి రాష్ట్ర మీడియా పేనలిస్ట్ మరియు గాజువాక ఇంచార్జ్ కరణంరెడ్డి నరసింగరావు.

జనసేన ఇంచార్జ్ మరియు డిసిసిబి చైర్మన్ కోన తాతారావు, టిడిపి సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్లు మొల్లి ముత్యాలనాయుడు,లేళ్ల కోటేశ్వరరావు, కూటమి నాయకులు కోసూరు తాతారావు, చేబ్రోలు అశోక్,గంధం వెంకటరావు, గవర సోమశేఖర్, దశేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ANIL, VIZAG CITY

ANIL, VIZAG CITY

Next Story